»   » పాపం సూపర్ స్టార్, నెం.1 చెత్త సినిమా ఆయనదే ( పూర్తి లిస్ట్)

పాపం సూపర్ స్టార్, నెం.1 చెత్త సినిమా ఆయనదే ( పూర్తి లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో అవార్డుల గురించి అందరికీ తెలిసిందే. బెస్ట్ డైరెక్టర్.. బెస్ట్ హీరో.. బెస్ట్ హీరోయిన్.. బెస్ట్ కమెడియన్.. ఇలా బెస్ట్.. బెస్ట్.. బెస్ట్.. బెస్ట్ అంటూ అన్ని కేటగిరిల్లో అవార్డులు ఇవ్వడం తరచూ చూస్తూనే ఉన్నాం.

ఇదే విధంగా చెత్త పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారికి కూడా మన దేశంలో ప్రత్యేకంగా అవార్డుల కార్యక్రమం ఉంది. బాలీవుడ్లో ప్రతి ఏటా 'గోల్డెన్ కేలా అవార్డ్స్' పేరుతో వీటిని ప్రకటిస్తున్నారు. 2009లో జతిన్ వర్మ ఈ 'గోల్డెన్ కేలా' అవార్డులను తెరపైకి తెచ్చారు. ప్రతి ఏటా ఈ చెత్త అవార్డులకు నామినేషన్స్ తీసుకుంటారు.

ఈ వేడుకలో.. వరస్ట్ అవార్డు గోస్ టూ అంటూ .. గోల్డెన్ కేలా అవార్డును అనౌన్స్ చేస్తారు. ఈ ఇయర్ కూడా గోల్డెన్ కేలా అవార్డులు ప్రకటించారు. అత్యంత చెత్త సినిమాగా షారుక్ ఖాన్ నటించిన 'దిల్ వాలె' చిత్రానికి అవార్డు దక్కింది. స్టార్ హీరో సినిమా కావడం, భారీ ఎత్తున రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద వసూళ్లు బాగానే వచ్చాయి కానీ ... ప్రేక్షకులు మాత్రం దీన్ని చెత్త సినిమా అని తేల్చేసారు. ఇంకా ఎవరెవరు ఈ చెత్త సినీ అవార్డులు అందుకున్నారో చూద్దాం..

Dilwale receives Worst Film Award

వరస్ట్ సినిమా - దిల్ వాలె

వరస్ట్ యాక్టర్(మగ) - సూరజ్ పంచోలి (చిత్రం : 'హీరో')

వరస్ట్ యాక్టర్ (ఆడ) - సోనమ్ కపూర్ (చిత్రం: ప్రేమ్ రతన్ ధన్ పాయో)

వరస్ట్ డైరెక్టర్ - సూరజ్ భర్జాతియా (చిత్రం: ప్రేమ్ రతన్ ధన్ పాయో)

మోస్ట్ ఇరిటేటింగ్ సాంగ్ - ప్రేమ్ రతన్ ధన్ పాయో( చిత్రం: ప్రేమ్ రతన్ ధన్ పాయో)

దారుణంగా ఉన్న సాంగ్ లిరిక్స్: అల్ఫాజ్ బర్త్ డే బాష్ (చిత్రం: ఢిల్లీవాలి జాలిమ్ గర్ల్ ఫ్రెండ్)

అర్థం పర్థం లేని రీమేక్/సీక్వెల్ - ఎం.ఎస్.జి 2

ఇంకా నటుడిగా ఎందుకు ప్రయత్నిస్తున్నావు అవార్డ్ - ఇమ్రాన్ ఖాన్ (కట్టి భట్టి)

స్పెషల్ అవార్డ్స్....

మనోజ్ కుమార్ అవార్డ్ ఫర్ హిస్టారిక్ అక్యూరెసీ: సంజయ్ లీలా భన్సాలీ(బాజీరావు మస్తానీ)

రారా సింగ్ అవార్డ్ (చెత్తగా డైలాగులు పలికి నందుకు): రణదీప్ హుడా (మై ఔర్ చార్లెస్)

సంఘ్ పరివార్ అవార్డ్: దిల్ వాలె చిత్రంలోని 'గెరువా' పాట

శక్తి కపూర్ 'స్త్రీ ద్వేషి' అవార్డ్ : ప్యార్ కా పంచునామా 2

వాట్ ది హెల్: సోనాక్షి సిన్హా (ఇష్క్ హాలిక్)

English summary
Golden Kela Awards of 2016 was truly a cracker of a ceremony! While Sooraj Pancholi was bestowed with the Worst Actor (Male) award, Dilwale sweeps Golden Kela for the Worst Film at the 8th Golden Kela Awards Show, where the worst of Indian cinema in 2015 was celebrated with gusto.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu