»   » షారుక్-కాజోల్ రొమాంటిక్ సాంగ్ సూపర్బ్ (వీడియో)

షారుక్-కాజోల్ రొమాంటిక్ సాంగ్ సూపర్బ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu


హైదరాబాద్: చాలా కాలం తర్వాత బాలీవుడ్ రొమాంటిక్ జోడీ షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ‘దిల్ వాలే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో ఇదీ ఒకటి. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేసారు.

ప్రీతమ్ సంగీతం అందించి ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లికిర్స్ సమకూర్చారు. బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్, అంతారా మిత్రా పాడిన ఈ పాట యూత్ ను, అభిమానులను మంత్రముగ్దులను చేసింది. సాంగ్ చిత్రీకరణ కూడా బావుంది. ఈ సాంగును ఒక్క రోజులోనే దాదాపు 6 లక్షల మంది చూసారు.

రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై గౌరీఖాన్‌, రోహిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్, కాజోల్ తో పాటు యువ జంటగా వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ నటిస్తున్నారు. ఇందులో కార్లను రీమోడలింగ్‌ చేసే వ్యక్తిగా షారుక్‌, ఆయన తమ్ముడిగా వరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ‘చెన్నై ఎక్స్ ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత షారుఖ్‌, రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం సమకూర్చిన పాటలు దీపావళి సందర్భంగా నవంబర్‌ 11న సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేసారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. డిసెంబర్‌ 18న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు.

English summary
Watch romantic couple Shah Rukh Khan and Kajol make a comeback with Dilwale, the most awaited film of 2015. With music by Pritam, heart felt lyrics by Amitabh Bhattacharya and sung in the soulful voices of Arijit Singh & Antara Mitra, don’t be surprised if you feel a love overdose after watching the first song - Gerua.Experience love in all it’s glory, Rohit Shetty Style.
Please Wait while comments are loading...