»   »  టిపికల్ రోహిత్ శెట్టి :షారూఖ్ 'దిల్‌ వాలే' ట్రైలర్ (వీడియో)

టిపికల్ రోహిత్ శెట్టి :షారూఖ్ 'దిల్‌ వాలే' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై :బాలీవుడ్‌ హిట్‌ పెయిర్‌ షారుఖ్‌- కాజోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'దిల్‌ వాలే'. వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ కీలక పాత్రధారులు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్ ని సోషల్ మీడియా ద్వారా షారూఖ్ ఖాన్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

బాలీవుడ్‌ తెరపై షారుక్‌ఖాన్‌, కాజోల్‌ సూపర్‌ హిట్‌ పెయిర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయెంగే' భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ అద్బుతంగా నిలిచింది. ఏళ్ళ తరబడి ముంబైలోని మరాఠా మందిర్‌లో ప్రదర్శితమైంది ఈ మేటి చిత్రం. ఆ సినిమా టైటిల్‌లోని హాఫ్‌ పార్ట్‌ని కొత్త సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు షారుక్‌. అదే 'దిల్‌ వాలే'.

'Dilwale' trailer is finally out and it looks like a typical Rohit Shetty film

షారూఖ్‌, కాజోల్‌ జంటగా నటించిన ఈ చిత్రం కూడా గతంలో సంచలనం సృష్టించిన అద్భుత ప్రేమ కావ్యం 'దిల్‌ వాలే దుల్హనియే లేజాయేంగే' సినిమాలా తప్పక ఘనవిజయం సాధిస్తుందంటున్నారు. 'డీడీఎల్‌జే' ప్యూర్‌ రొమాంటిక్‌ మూవీ అయితే, రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వస్తున్న 'దిల్‌ వాలే' పూర్తిగా యాక్షన్‌ కామెడీ నేపధ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతోందట.

ఈ సినిమా డిసెంబర్ 18న విడుదల కాబోతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనరే అయినా అలనాటి 'డీడీఎల్‌జే'కి ఏమాత్రం తగ్గని రీతిలో రొమాంటిక్‌ అండ్‌ హార్ట్‌ టచ్చింగ్‌ సీన్స్‌ ఎన్నో ఈ 'డిడిఎల్‌జె'లో ఉంటాయని చెప్తున్నారు.

English summary
The trailer of the much awaited Shah Rukh Khan starrer 'Dilwale' is finally out and it looks like a regular Rohit Shetty film.
Please Wait while comments are loading...