»   »  ఒక నిర్మాత అరెస్టు..మరొకరకి వారెంట్

ఒక నిర్మాత అరెస్టు..మరొకరకి వారెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ చిత్ర నిర్మాత దినేష్‌గాంధీను జేపీనగర ఠాణా పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. హూ, వీరమదకరి తదితర చిత్రాలకు దినేష్‌గాంధీ నిర్మాతగా వ్యవహరించారు. చెక్కు బౌన్సు కేసులో కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న ఆయనను అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేశారు. చెక్కు బౌన్సు కేసులో ఆయనను సంజయనగర ఠాణా పోలీసులు కూడా గతంలో అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Dinesh Gandhi arrested over cheque bounce case

మరో ప్రక్క ఇంకో సినీ నిర్మాత పార్వతమ్మ రాజ్‌కుమార్‌కు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వారెంట్లను పంపించారని దీనిపై చర్య తీసుకోవాలని జనతాదళ్‌ సభ్యుడు సందేష్‌నాగరాజు కోరారు. కార్మికులకు సంబంధించిన నగదు చెల్లించలేదని ఆరెండు సంస్థలు ఆమెను బంధించేందుకు వారెంట్లను జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు నిర్మించడం సాధ్యం కాదన్నారు.

సినీ చిత్రీకరణలు ఏడాది పాటు జరగవని- ఏడాదికి 20 నుంచి 40 రోజులు కార్మికులకు పని ఉంటుందని ఇలాంటి పరిస్థితుల్లో ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఏవిధంగా భర్తీ చేయాలని ప్రశ్నించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పరమేశ్వర్‌నాయక్‌ హామీ ఇచ్చారు.

English summary
Veera Madakari producer Dinesh Gandhi has been arrested by Jp nagar Police in connection with a cheque bounce case in Bangalore last night.
Please Wait while comments are loading...