»   » అందరూ కొత్తవాళ్ళతొ ఎన్ శంకర్ కొత్త సినిమా

అందరూ కొత్తవాళ్ళతొ ఎన్ శంకర్ కొత్త సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్.శంకర్ పేరు వినగానే 'ఎన్ కౌంటర్', 'శ్రీరాములయ్య', 'జయం మనదేరా', 'భద్రాచలం', 'జై బోలో తెలంగాణ' ... వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ప్రతీ సినిమానీ తనదైన పద్దతిలొ వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన స్వీయ దర్శకత్వంలో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఈసారి మాత్రం ఓ కొత్త కథని ఎంపిక చేసుకున్నాడట ఈ విలక్షణ దర్శకుడు. స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్‌ పతాకంపై మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు.

directer shankar planing a new movie with freshars

ఈ సినిమా ద్వారా కొత్తవాళ్లను నటీనటులుగా పరిచయం చేయనున్నట్టు ఆయన చెప్పారు. నాయకా నాయికల పాత్రలతో సహా, సినిమాలోని అన్నిరకాల పాత్రలకి కొత్తవారినే తీసుకోనున్నానని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన అన్వేషణ కొనసాగుతోందట. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌ పాత్రల కోసం 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు కావాలి. చిత్రంలో ఎనభై శాతం పాత్రలు ఈ ఏజ్‌ గ్రూప్‌కు చెందినవే. ఇతర పాత్రల కోసం కూడా 5 నుంచి 80 ఏళ్ల వయసు మధ్య వారు కూడా నటనపై ఆసక్తి ఉంటే వారికి తగిన పాత్రలు ఉన్నాయి.

ఆకర్షణీయ రూపం ఉండి, నటనపై ఆసక్తి ఉంటే చాలు. నటన రాకున్నా ఎంపిక తర్వాత వర్క్‌షాప్‌ నిర్వహించి తగిన శిక్షణ ఇస్తాం' అని తెలిపారు. ఒక వేళ ఔత్సాహికులకు నటన రాకపోయినా వర్క్ షాప్ ద్వారా నటన నేర్పించి మరీ తీసుకోనున్నారట. ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలను త్వరలో తెలియజేస్తానని చెప్పారు.

English summary
Need fresh actors for my new movie.. says director N.Shankar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu