»   » నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నా: జగపతి బాబు డైరెక్టర్

నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నా: జగపతి బాబు డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జగపతి బాబు నటిస్తున్న ‘హితుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు విప్లవ్ కోనేటి(33) అనారోగ్యంతో మృతి చెందనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రముఖ దిన పత్రికలకు సంబంధించిన వెబ్ సైట్లలో కూడా ఈ వార్త రావడంతో అంతా నిజమే అనుకున్నారు.

కానీ అవన్నీ వదంతులే అని తేలి పోయింది. తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానంటూ విప్లవ్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా స్పష్టం చేసారు. అనారోగ్యం కారణంగా తన సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్లు చెప్పాడు. తాను బతికే ఉన్నట్లు విప్లవ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో తెలిపాడు.

Directo Viplav is alive

నేను మరణాన్ని ప్రేమిస్తాను, నా రచనలు, ఆర్ట్, మాటల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నేను మెడిసిన్ చదువుతున్న రోజుల్లో మరణానికి సంబంధించిన విషయాలు చాలా నేర్చుకున్నాను. మరణం అనేది జోక్ కాదు. ఇలాంటి వార్తలు నన్ను చాలా డిస్ట్రబ్ చేసాయి అని పేర్కొన్నారు.

ఏంబీబీఎస్ చదివిన విప్లవ్.... సినిమాలపై ఆసక్తితో దర్శకత్వం వైపు అడుగులు వేసారు. ఈ క్రమంలో జగపతి బాబు నటిస్తున్న ‘హితుడు' సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. జూలై నెలలో ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
"I fell ill , hospitalized and cut myself off from phones. TRUE. Rest is a mystery" director Viplav said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu