»   » తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయిన తెలుగు డైరక్టర్

తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయిన తెలుగు డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ మధ్య కాలంలో తెలుగు సిని సెలబ్రెటీలు చాలా మంది పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు సినీ దర్శకుడు,మరియు డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ దొరికిపోయారు. ఆయన తాగి డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన నిన్న చోటు చేసుకుంది

హైదరాబాద్ జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద శనివారం అర్దరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీలో అమ్మరాజశేఖర్..త్రాగి తన వాహనం డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు.

Director Amma Rajasekhar held for drunk driving

మాదాపూర్ నుంచి జూబ్లిహిల్స్ వైపుకు చెక్ పోస్ట్ మీదుగా బంజారాహిల్స్ వైపు వెళ్తున్న ఆయనను ఈ డ్రైవ్ లో భాగంగా..బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. దాంతో ఆయన వాహనాన్ని సీజ్ చేసారు.

అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం అదే వాహనంలో ఉండటం గమనార్హం. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక అమ్మరాజశేఖర్ ..దర్శకుడుగా గోపీచంద్ తో చేసిన రణం చిత్రం మంచి హిట్. ఆ తర్వాత రవితేజ తో చేసిన చిత్రం ప్లాఫ్ అయ్యింది.

English summary
Amma Rajasekhar was held by Police for drunk driving at Jubilee hills check post .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu