twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బుర్రిపాలెం బుల్లోడు' దర్శకుడు కన్నుమూత

    By Srikanya
    |

    చెన్నై: దర్శకుడు బీరం మస్తాన్‌రావు(69) చెన్నైలో కన్నుమూశారు. బుర్రిపాలెం బుల్లోడు, విప్లవశంఖం, గయ్యాళి గంగమ్మ సినిమాలకు మస్తాన్‌రావు దర్శకత్వం వహించారు. మస్తానరావు గుంటూరులో 1944 అక్టోబరు 30న వెంకాయమ్మ, నాగయ్య దంపతులకు జన్మించాను. చాలా కాలం వరకు సంతానం లేకపోవడంతో, కాలేమస్తాన్‌ షావలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టడంతో మస్తాన్‌రావు అనే పేరు పెట్టారు. మొదట్లో వంద నాటకాలకుపైగా ఆడారు. బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌లాంటి బహుమతులెన్నో అందుకున్నారు.

    తర్వాత కె.బాపయ్య దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మేమూ మనుషులమే, ఇంద్రధనుస్సు, ఎదురులేనిమనిషిలాంటి సినిమాలకు చేశారు. కె.రాఘవేంద్ర రావు డైరెక్టర్‌గా మొదటి సినిమా 'బాబు' సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. సాహసవంతుడు సినిమా నిర్మాత కె.విద్యాసాగర్‌ అవకాశమివ్వడం తో మొదటిసారిగా డైరెక్టర్‌గా 'బుర్రిపాలెం బుల్లోడు' సినిమా తీశారు.

    Director Beeram Mastan Rao died

    ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు అప్పట్లో వసూలు చేసి శతదినోత్సవం జరుపు కుంది. శ్రీదేవికి కమర్షియల్‌ హీరోయిన్‌గా మంచిబ్రేక్‌ నిచ్చింది. తర్వాత గయ్యాళిగంగమ్మ, ప్రేమసింహాసనం, తల్లిగోదావరి సినిమాలకు దర్శకత్వం వహించారు. మాదాల రంగారావు 'మీకు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో పరి చయం ఉంది. ఓ సినిమా తీసిపెట్టండి అని అడగటంతో విప్లవశంఖం సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్‌.టి.రామారావు,రతి జంటగా ప్రేమ సింహాసనం సినిమాకు దర్శకత్వం వహించారు.

    కోడి రామకృష్ణ దర్శకతంలో రైల్వే కూలి సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటించే అవకాశమిచ్చారు. ఇందులో హీరో మమ్ముట్టి. ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో ఆర్టిస్టుగా పేరు రాలేదు. ఆయనకు దర్శకత్వం మీదే ఇంట్రస్టు ఉంది. అందుకే ఆర్టిస్టుగా ప్రయత్నం చేయలేదు. 1984లో ఆయనే నిర్మాతగా మారి సువర్ణసుందరి సినిమా తీశారు. ఇందులో చంద్రమోహన్‌ హీరోగా నటించారు. 8 నంది అవార్డులు వచ్చాయి. కానీ పెట్టుబడి రాలేదు. ఆర్థికంగా నష్టపోయారు.

    1988లో హైదరాబాద్‌ వచ్చేశాను. దూరదర్శన్‌ కార్యక్రమాలకు దర్శకత్వం వహించసాగారు. ప్రజాకవి, వేమన కథా స్రవంతి సీరియల్స్‌కి దర్శకత్వం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రోగ్రామ్స్‌కు దర్శకత్వం చేశారు. 2005-06 లో జెమినీ ఛానెల్‌ కోసం 'నారీయాగం' సీరియల్‌కు దర్శకత్వం వహించారు. దీనికి 4 నంది అవార్డులు వచ్చాయి. ఇందులో మొట్టమొదటి సారిగా నాగబాబు ప్రధాన పాత్రను, హీరోయిన్‌గా సన నటించారు. తర్వాత ''రామానుజచారి' సీరియల్‌ చేశారు. ప్రముఖ రచయిత మల్లాది సాహచర్యంతో ధ్యానంవైపు మళ్ళారు. మూడుసార్లు హిమాలయాలకు వెళ్ళి వచ్చాను. చాలామందికి యోగ, ధ్యానం నేర్పుతూ వచ్చారు. ఆయన మృతి వన్ ఇండియా తెలుగు సంతాపం తెలియచేస్తోంది.

    English summary
    Telugu Director Beeram Mastan Rao Passed away this morning. He was Suffering with illness since few months. he brethed his last today morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X