నిర్మాతగా మారనున్న యంగ్ టైగర్ డైరెక్టర్.. మెగా హీరోతో సినిమా..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు నిర్మాతలుగా మారటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో దర్శకుడు చేరుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో సర్థార్.. ఎన్టీఆర్‌తో జై లవకుశ వంటి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ సంతోష్ రవింద్ర కొల్లి(బాబీ) నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.

బెస్ట్ యాక్టర్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు అరుణ్ పవార్.. తర్వాత సప్తగిరి ఎక్ప్‌ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అరుణ్ పవార్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో ఒక సినిమ తీసేందుకు కథ సిద్దం చేసుకున్నాడు. ఆ సినిమాకు నిర్మాతగా దర్శకుడు బాబీ వ్యవహరించనున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌లో మొదలు కానుండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











