»   » "సరైనోడు" పై బోయపాటి విచారమా..?

"సరైనోడు" పై బోయపాటి విచారమా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకుని కూడా మళ్ళీ పుంజుకొని ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా సెటిల్ అయిన 'సరైనోడు' సక్సెస్స్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లుఅర్జున్ పై దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అలిగాడట... కారణం సినిమా సక్సెస్ లో తనకి సరైన గుర్తింపు లభించటం లేదని ఆయన ఫీలవ్వటమే..

ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు దర్శకుడిదే తప్పన్నట్టు గా అందరూ మాట్లాడతారు కానీ అదే సినిమా సక్సెస్ అయినప్పుడు మాత్రం హీరో ని మత్రమే ఆకాశానికెత్తేస్తారు. సినిమా సక్సెస్ లో హీరోకి ఎంత భాగముందో అంతే భాగం దర్శకుడికీ ఉంటుందికదా... మరి సరైనోడు సక్సెస్ కి ఇంతగా కారణమైన తనని ఎవరూ పట్టించుకోవటం లేదని బోయపాటి కాస్త భాదపడుతున్నాడని టాక్...

 Director Boyapati sreenivas not happy with Allu Arjun..?

సరైనోడు వచ్చి రెండు వారాలు దగ్గర పడుతున్నా.. సినిమా విజయానికి అల్లు అర్జున్ మాత్రమే కారణం అన్నట్టుగా అంతా చెప్పుకుంటున్నారనీ., కనీసం అర్జున్ కూడా దర్శకుడిగా తన పేరు ఎక్కడా ప్రస్థావించటం లేదనీ, అది తనని బాదించిందనీ బోయపాటి భాదపడ్డారట.

బాలయ్య బాబుతో తాను తీసిన'లెజెండ్' తరువాత ఆ సినిమా ప్రమోషన్ లో బాలకృష్ణ తనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన విషయాన్ని బోయపాటి అల్లుఅరవింద్ కి గుర్తు చేసారట. ఈ వార్త బన్నీ దాకా వెళ్ళటం తో బోయపాటి ఇబ్బందిని అర్థం చేసుకున్న బన్నీ త్వరలో నిర్వహించబోతున్న 'సరైనోడు' సక్సస్ టూర్ లో బోయపాటికి సరైన ప్రాధాన్యత కల్పిస్తాము అని స్వయంగా చెప్పినట్లు టాక్. అంతేకాదు వచ్చే సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాను చేస్తాను అని బన్నీ ప్రామిస్ కూడా చేసాడట..

English summary
Boyapati feels he is not getting credit on Sarainodu success
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu