»   » బాలకృష్ణ ని కన్ఫ్యూజ్ చేస్తే... :బోయపాటి శ్రీను

బాలకృష్ణ ని కన్ఫ్యూజ్ చేస్తే... :బోయపాటి శ్రీను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకష్ణగారితో సినిమా తీయడం నాకు కంఫర్ట్ గా వుంటుంది. ఆయన ముందు కాన్ఫిడెంట్‌గా వుంటే చిన్నపిల్లాడిగా వుంటాడు. మనలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అయితే ఆయన సింహంలా మారతాడు. తప్పును కూడా ధైర్యంగా చెప్పగలిగే వారికి ఆయన ఎంతో విలువిస్తారు అంటూ బాలకృష్ణతో తన ఎక్సపీరియన్స్ ని చెప్పుకొచ్చారు బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం లెజండ్ మంచి విజయం సాధించింది.

అలాగే... ''ఏదైతే వూహించి తీశానో... ఆ ఫలితాన్ని నూటికి నూరుపాళ్లు ఇచ్చింది 'లెజెండ్‌'. ప్రేక్షకులు 'ఒక మంచి సినిమా తీశావ'ని భుజం తడుతున్నారు. బాలకృష్ట నటనలోని పరిణతి ఏమిటో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయనతో రెండు సినిమాలు చేయడం చక్కటి అనుభవం. తప్పో ఒప్పో ఆత్మవిశ్వాసంతో అడుగేయాలనేది బాలకృష్ణ సిద్ధాంతం''.

Director Boyapati Srinu about work with Balakrishna

ఇక 'లెజెండ్‌' గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకొంటున్నారు కానీ... నేను ఈ సినిమా పనుల్ని మూడేళ్ల క్రితమే మొదలుపెట్టాను. బాలయ్యని కొత్తగా చూపించాలి, అదెలా? అంటూ ఎంతో తపనపడ్డా. ఇంగ్లీష్‌ లుక్‌ కోసం చాలా కసరత్తులు చేశా. నాకు పుట్టిన రోజులు జరుపుకోవడం పెద్దగా ఇష్టముండదు. నా సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడే నా పుట్టినరోజుగా భావిస్తా. 'లెజెండ్‌' విజయం తర్వాత వచ్చిన ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది''.

అంతేకాదు... ''బాలకృష్ణతో మరో సినిమా చేస్తా. అదెప్పుడన్నది మాత్రం తెలియదు. ఆయనకు తగిన కథ ఇప్పుడు నా దగ్గర లేదు. మళ్లీ బాలయ్యతో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి కథ దొరకగానే సినిమా మొదలుపెడతా. అది బాలయ్య వందో సినిమానా? ఇంకొకటా అనేది నాకు తెలీదు. ఆయన కూడా ఎప్పుడూ అంకెల గురించి మాట్లాడరు. 'మంచి కథ ఉంటే వచ్చేయ్‌' అని చెబుతుంటారు. మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే బాధ్యతని కూడా బాలయ్య నాకే అప్పగించారని బయట ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ తెరపైకి రావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పుడు ఆ పరిస్థితుల్ని బట్టి బాలయ్య నిర్ణయం తీసుకొంటారు'' అని చెప్పారు.

English summary

 Boyapati Srinu Said that ...Balakrishna don't want any confusion at Sets. He says that though the shooting of ‘Legend’ began around a year ago, the foundation was laid three years ago, after the success of his earlier film ‘Simha’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu