»   » తప్పతాగిన సినీరచయిత, మరోకారులో హీరో రవితేజ!

తప్పతాగిన సినీరచయిత, మరోకారులో హీరో రవితేజ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
BVS Ravi held for drunk and drive
హైదరాబాద్: హీరో రవితేజ పేరు మరోసారి మీడియాలో మార్మోగి పోతోంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో అటు వైపుగా సినీ హీరో రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, సినీ రచయిత బీవిఎస్ రవి ప్రయాణిస్తున్న కారు వచ్చింది. తనిఖీలు చేయగా కారు డ్రైవ్ చేస్తున్న సినీ రచయిత బీవీఎస్ రవి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. కారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రవితేజ, శ్రీనివాసరెడ్డి మరో కారులో వెళ్లాల్సి వచ్చింది.

పాపం రవితేజ తప్పేమీ లేక పోయినా....తన చుట్టూ ఉండే వారి మూలంగా రవితేజ పరువు పోతోంది. గతంలో రవితేజ తమ్ముళ్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం తెలిసిందే. మరోసారి అతని తమ్ముడు తప్పతాగి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు రవితేజకు అత్యంత సన్నిహితుడైన బివిఎస్ రవి పోలీసులకు పట్టుబడ్డాడు.

రవితేజ సినిమాల విషయానికొస్తే...
మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిజూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రవితేజ గత చిత్రం 'బలుపు' కూడా గతేడాది జూన్ నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్

వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).

English summary
Director BVS Ravi held for drunk and drive.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu