twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాగ్ మిల్కా బాగ్’ కి అరగంట కోత

    By Srikanya
    |

    ముంబై: పంజాబ్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారు డు, 'పద్మశ్రీ' అవా ర్డు గ్రహీత మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన 'బాగ్ మిల్కా బాగ్' (హిందీ) కి అరగంట కోత పడనుంది. వాణిజ్యపరంగా సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా కనకవర్షం కురుస్తుండగా, విదేశాల్లో ప్రదర్శనకు నిర్మాతలు ప్రత్యేక దృష్టి సారించారు. మూడు గంటల పది నిమిషాలు నడిచే ఈ సినిమా నిడివిని తగ్గించి, విశ్వవ్యాప్తంగా విడుదల చేసే పని చురుగ్గా సాగుతోందని దర్శక,నిర్మాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా చెబుతున్నారు. విదేశీయుల కోసం సినిమా నిడివిని అరగంట మేరకు తగ్గిస్తున్నట్లు, 'ఇంటర్వెల్' లేకుండా ఏకబిగిన సినిమా సాగేలా మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    కథనం, పాటలు, ఆసక్తికరమైన సన్నివేశాలను తొలగించకుండా సినిమా నిడివిని తగ్గించేందుకు ఎడిటింగ్ విభాగానికి చెందిన పిఎస్ భారతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హిట్టయిన సినిమాకు నిడివిని తగ్గించడం ఓ సవాల్ వంటిదని, అయినా ఆ పని సంతృప్తికరంగానే పూర్తవుతోందని దర్శక, నిర్మాత చెబుతున్నారు.

    'ఇంటర్వెల్'తో సినిమాను రెండు భాగాలుగా విభజించే సంప్రదాయం తూర్పు దేశాల్లో లేదని, విదేశీ ప్రేక్షకుల కోసం మరోసారి 'ఎడిటింగ్'పై దృష్టి పెట్టాల్సి వచ్చిందన్నారు. మిల్కాసింగ్ పాత్రలో ఫర్హాన్ ఖాన్ నటించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం వల్లే సినిమా ఇంతటి ఘన విజయం సాధించిందని ఓం ప్రకాష్ మెహ్రా ఆనందం వ్యక్తం చేశారు.

    మరో ప్రక్క సినిమాకు వినోదపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలల పాటు ఈ మినహాయింపు వర్తిస్తుంది. మిల్కాసింగ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, దేశభక్తిని పెంపొందించే 'చెన్నై ఎక్స్‌ప్రెస్' వంటి భారీ బడ్జెట్ సినిమాలెన్ని విడుదలైనా గట్టి పోటీ ఇస్తూ 'బాగ్ మిల్కా..' ప్రేక్షక జనాదరణతో ముందుకు దూసుకుపోతోంది. ఇలాంటి చిత్రాలను అన్ని వర్గాల వారూ చూడాలన్న ఉద్దేశంతో ఈ సినిమాకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

    'బాగ్ మిల్కా బాగ్ సినిమా ప్రతి ఒక్కరికీ ఉత్తేజాన్ని కలిగిస్తుంది, అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి కీర్తినార్జించిన క్రీడాకారుడి గురించి నేటితరం తప్పనిసరిగా తెలుసుకోవల్సి ఉంది. ముఖ్యంగా యువతీ యువకులంతా ఈ సినిమాను చూడాలన్న తలంపుతోనే వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిన'ట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే దారిలో మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయి. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కాసింగ్ పాత్రలో ఫర్హాన్ ఖాన్, ఆయన సోదరి పాత్రలో సోనమ్ కపూర్ నటించారు.

    English summary
    Director-producer Rakeysh Omprakash Mehra has shortened “Bhaag Milkha Bhaag” (BMB) for its international release. He has reduced the playing-time of the biopic by 30 minutes and said the new version is suitable for a no-interval format.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X