40ప్లస్ బ్యాచిలర్ కథ: దశరథ్
దశరథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'గ్రీకువీరుడు'. నాగార్జున-నయనతార జంటగా నటించారు. కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం(మే 3న) ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాగే నా నిజజీవితంలో ఏ అమ్మాయి వెంటా పడలేదు. ఇవేవీ నా స్వీయానుభవాలు కాదు..అని దశరథ్ చెప్పుకొచ్చారు. ''నాగ్‌తో నా సినిమా అనగానే ప్రేక్షకులు సంతోషం..లాంటి ఓ కుటుంబ సినిమా కావాలనుకుంటారు. అందుకు తగ్గట్టే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తీర్చిదిద్దాం అన్నారు.
'గ్రీకువీరుడు' లో నాగ్ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. నయన్ నటన హైలైట్. నాగ్ ఈవెంట్ మేనేజర్‌గా నటిస్తారు. అయితే ఆ పాత్రకి టైటిల్‌కి సింక్ కంటే..నాగ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ టైటిల్ పెట్టాం. ఇది రొమాంటిక్ కామెడీ కాదు. ప్రేమకథా చిత్రం కాదు. ప్రేమ, సెంటిమెంట్, కామెడీ, అనుబంధాలు అన్ని అంశాల మేలు కలయికతో తీర్చిదిద్దిన నవతరం చిత్రం. ఓ సమస్యని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాం'' అన్నారు. తమిళ్‌లో 'లవ్‌స్టోరి' పేరుతో ఇదే రోజున విడుదలవుతోందని తెలిపారు.


Click it and Unblock the Notifications












