»   » 3ఇడియట్స్ పై నోరువిప్పి కొత్త కబురులు చెప్పిన డైరెక్టర్ శంకర్..

3ఇడియట్స్ పై నోరువిప్పి కొత్త కబురులు చెప్పిన డైరెక్టర్ శంకర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న '3 ఇడియేట్స్' రీమేక్ (తమిళంలో దీని పేరు 'నన్బన్') గురించి తొలిసారిగా నోరు విప్పాడు. తన బ్లాగులో ఈ సినిమా గురించి మంచి జోష్ తో వివరాలు రాసాడు. 'ఊటీలో తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. స్టార్టింగ్ బాగుంది. బాగా ఎంజాయ్ చేసాను. అంతా యంగ్ టీమ్ వల్ల అందరిలోనూ మంచి ఎనర్జీ పొంగిపొరలింది. ఈ సినిమా షూటింగ్ సరదా సరదాగా సాగుతోంది"అంటూ తన బ్లాగులో తాజాగా రాసాడు. కథానాయిక ఇలియానా, జీవా, శ్రీకాంత్ (శ్రీరాం) ఈ షెడ్యూలులో పాల్గొన్నారు. ఇలియానా పై పెళ్లికూతురు గెటప్పులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా, రెండో షెడ్యులు షూటింగు త్వరలో డెహ్రాడూన్ లో ప్రారంభమవుతుందని అంటున్నారు. ఆ షెడ్యూలులో హీరో విజయ్ జాయిన్ అవుతాడు. జెమినీ ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

English summary
After keeping the audience on their toes about 3 Idiots remake for over two months, director Shankar has finally posted on the latest happenings of Nanbab on his website.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu