»   » విచిత్రమైన ట్యాగ్ లైన్ తో 'కాఫీబార్'

విచిత్రమైన ట్యాగ్ లైన్ తో 'కాఫీబార్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నా సినిమాలకు ఇంతవరకూ ట్యాగ్‌లైన్ పెట్టలేదు. కానీ తొలిసారిగా 'ఈ సినిమా మీరుఊహించినట్లు ఉండదు. కానీ కచ్చితంగా మీకు నచ్చుతుంది' అని ట్యాగ్‌లైన్ పెట్టాం అంటున్నారు గీతాకృష్ణ. స్వీయ దర్శకత్వంలో ఆయన బ్లూ ఫాక్స్ సినిమా పతాకంపై శశాంక్, బియాంకా దేశాయ్ జంటగా నిర్మించిన 'కాఫీబార్' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆయన ఈ చిత్రం గురించి చెబుతూ.. నిజం చెప్పాలంటే ఇది గొప్ప సినిమా కాదు.. కానీ మంచి సినిమా. మంచి సందేశం ఇవ్వాలనే తపనతో, హృదయపూర్వకంగా చేసిన మంచి ప్రయత్నమిది' అన్నారు. అలాగే ఇటీవల పుణేలో జరిగిన సంఘటన కానీ, ఇతర ప్రదేశాలకు విస్తరించిన ఉగ్రవాదం కానీ ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తున్నాయి. వాటిని అరికట్టాలంటే చట్టపరంగా, రాజ్యాంగ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన సందేశాన్ని సున్నితంగా మా 'కాఫీబార్'లో చెప్పడం జరిగింది' అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu