»   » విద్యుత్‌ తరంగంలా, నడిచే నిప్పు కణంలా రవితేజ

విద్యుత్‌ తరంగంలా, నడిచే నిప్పు కణంలా రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ..విద్యుత్‌ తరంగంలా, నడిచే నిప్పు కణంలా తమ తాజా చిత్రం 'డాన్‌ శీను' లో కనిపించనున్నారని దర్శకుడు గోపీచంద్‌ మలినేని చెప్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. సహ నిర్మాత వి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ..."రవితేజ నటనే ఈ సినిమాకు ప్రధాన బలం. ఇటీవలే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. మణిశర్మ చక్కని మ్యూజిక్‌ ఇచ్చారు. 'కిక్‌' తర్వాత మా ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌లో వస్తున్న మరో పూర్తిస్థాయి వినోదభరిత చిత్రం 'డాన్‌ శీను' అన్నారు. శ్రియ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, అంజనా సుకాని, మహేష్‌ మంజ్రేకర్‌, డా.బ్రహ్మానందం, షయాజీ షిండే, అలీ, యాశ్‌ పాల్ ‌శర్మ, వేణుమాధవ్‌, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కథనం, మాటలు: కోన వెంకట్‌, కెమెరా: సమీర్‌రెడ్డి, కో-డైరెక్టర్‌: తరణీరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu