Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy: భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినా.. నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. దర్శకుడి ఆవేదన!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మాస్ కమర్షియల్ దర్శకుడిగా తన స్థాయిని మరో లెవల్ కు పెంచుకున్న వారిలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈ దర్శకుడు బాలకృష్ణతో చేసిన వీర సింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు తన రెమ్యునరేషన్ విషయంలో జరిగిన అన్యాయం గురించి క్లారిటీగా తెలియజేశాడు. దాదాపు ఒక ఏడాదిన్నర పాటు తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని కూడా చెప్పాడు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

ప్రాఫిట్స్ దిశగా వీరసింహారెడ్డి
దర్శకుడు గోపీచంద్, నందమూరి బాలకృష్ణ తో చేసిన వీర సింహారెడ్డి సినిమా మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు రివ్యూల పరంగా కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓవర్గం ప్రేక్షకులను మాత్రం బాగానే కట్టుకుంటుంది. అంతేకాకుండా సినిమా బ్రేకింగ్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి చాలా దగ్గరకు వచ్చేసింది. దాదాపు సినిమా అన్ని ఏరియాలలో కూడా ప్రాఫిట్స్ అందించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

నిజజీవితంలోని ఘటనలు
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను కూడా కొన్ని నిజ జీవితంలోని సంఘటనలను ఆధారంగా తెరపైకి తీసుకువచ్చాడు. నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ తో పాటు అందులోని కొన్ని ఫ్యాక్షన్స్ సన్నివేశాలు కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇంతకుముందు చేసిన క్రాక్ సినిమా కూడా నిజజీవితంలోని పాత్రల ఆధారంగా తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలియజేశాడు.

క్రాక్ రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదు
ముఖ్యంగా క్రాక్ సినిమా అయితే కొన్ని ఫైనాన్షియల్ సమస్యల వలన విడుదల అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేనే డిస్ట్రిబ్యూటర్స్ అందరితో కూడా మాట్లాడి ఆ సినిమాను విడుదల చేయించాను. అయితే ఆ సినిమాకు నిర్మాతగా ఉన్న టాగూర్ మధు మాత్రం పూర్తిస్థాయిలో నాకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఇంకా 70 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. ఇక తర్వాత కూడా దాని గురించి నేను అడగలేదు.. అని గోపిచంద్ అన్నాడు.

ఆ కారణాలు చెప్పి..
క్రాక్ సినిమా కంటే ముందు ఆ నిర్మాతకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. బడ్జెట్ పెరిగిందని కారణాలు చెప్పారు. కానీ నేను మాత్రం సినిమాకు ఎంత అవసరమో అంత పెట్టించాను. ఇక అంతకు ముందు చేసిన అప్పులు తీర్చడానికి వాళ్ళకు క్రాక్ సినిమా ఉపయోగపడింది. అయితే దాదాపు నటీనటులందరికీ కూడా మంచి పారితోషికాలు ఇప్పించాను. కానీ చివరికి నాకే అందులో రెమ్యునరేషన్ రాలేదు. ఇక తర్వాత దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.. అని గోపీచంద్ తెలియజేశాడు.

మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా..
అయితే వీర సింహారెడ్డి సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే నాకు పూర్తిస్థాయిలో పారితోషికం ఇచ్చింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే నేను ఒప్పుకున్న రెమ్యునరేషన్ ఈ యొక్క ప్రొడక్షన్ నుంచి దక్కింది. ఇక గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఒక మేనేజర్ ను పెట్టుకోవాలి అని అనిపించింది. అందుకే ఇప్పటినుంచి అలా వెళుతున్నాను.. అని గోపీచంద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.