Don't Miss!
- News
ప్రధాని మోడీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఏం చెయ్యనుందంటే!!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Jr ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా మెగాస్టార్ చేతికి.. క్లారిటీ ఇచ్చిన వీరసింహారెడ్డి దర్శకుడు!
ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మాస్ దర్శకుడిగా మరోసారి మంచి గుర్తింపును అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య బాబును ఊర మాస్ క్యారెక్టర్ లో మంచి యాక్షన్ ఎలివేషన్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అయితే ఈ దర్శకుడు ఇంతకుముందు క్రాక్స్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో పారితోషికం మాత్రం మొదటిసారి వీర సింహారెడ్డి సినిమాకి అందుకున్నాను అని ఇటీవల ఇంటర్వ్యూలో గోపీచంద్ తెలియజేశాడు.
ఇంతకుముందు క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కూడా ఆ సినిమాకు తనకు 70 లక్షల వరకు రెమ్యునరేషన్ రావాల్సి ఉంది అని ఓపెన్ గా తెలియజేశాడు. ఇక ఇటీవల మరోసారి దర్శకుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నం చేశాను అని అయితే ఆ కథ అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్ళింది అని చెప్పాడు.

తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలి అని మురగదాస్ గారు నాకు ఆఫర్ చేశారు. ఎన్టీఆర్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ తర్వాత అనుకోకుండా ఆ సినిమా రీమేక్ హక్కులను మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకుని ఇక్కడ ఖైదీ నెంబర్ 150 గా విడుదల చేయడం జరిగింది ఆ విధంగా ఎన్టీఆర్ తో ఒక ఆఫర్ మిస్ చేసుకున్నాను అని అన్నాడు.
అంతేకాకుండా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలని కూడా అనుకున్నాను. ఒక యాక్షన్ హై వోల్టేజ్ సినిమా కథ గురించి చెప్పాను. అయితే కథ నచ్చినప్పటికీ కూడా గోపీచంద్ దగ్గర నుంచి తాను ఒక మంచి కామెడీ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను అని ఎన్టీఆర్ అనడంతో మళ్ళీ ఆ కాంబినేషన్ క్యాన్సిల్ అయింది అని అన్నాడు. కానీ తప్పకుండా భవిష్యత్తులో మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అని ఈ దర్శకుడు తన మనసులోని మాటను తెలియజేశాడు.