»   » దర్శకుడు హను రాఘవపూడి వివాహం ఈ నెల్లోనే, ఎవరితోనంటే

దర్శకుడు హను రాఘవపూడి వివాహం ఈ నెల్లోనే, ఎవరితోనంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా ఆగస్టు 7 ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో మరో దర్సకుడు హను రాఘవపూడి కూడా ఓ ఇంటివాడవుతున్నాడు. హను రాఘవపూడి వివాహం ఈ నెల(ఆగస్టు)26న జరగనుంది. ఆయన వివాహం చేసుకోబోయేది కూడా క్రిష్ లాగానే ఓ డాక్టర్ ని.

హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పటిల్ లో పనిచేస్తున్న డా.అమూల్య ...ఆయనకు ధర్మపత్ని కానుంది. మే నెలలో వీరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. కృష్ణగాడివీరప్రేమగాధ చిత్రం రిలీజ్ అయ్యాక, హను తల్లితండ్రులు వెతికి సెట్ చేసిన సంభంధం ఇది.

Director Hanu Raghavapudi to marry on August 26

ఇక ప్రస్తుతం హను రాఘవపూడి...నితిన్ తో సినిమా చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. అఖిల్ తో మొదట అనుకున్న ఈ ప్రాజెక్టు ఊహించని విధంగా నితిన్ తో ముందుకు వెళ్తోంది. ఈ చిత్రం అనంతరం అఖిల్ చేసే అవకాసం ఉంది.

ఆగస్టు 26న ఓ డాక్టర్ తో ఈ డైరక్టర్ ఇంటివాడవుతున్న సందర్బంగా వన్ ఇండియా తెలుగు ..ముందుగానే ఈ జంటకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది. మీరు కూడా అడ్వాన్స్ విషెష్ ..క్రింద కామెంట్ల కామెంట్ల కాలంలో తెలియచేయవచ్చు.

English summary
Director Hanu Raghavapudi is going to marry his soulmate - on the 26th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu