»   » ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలనుందని మళ్లీ చెప్పాడు, కానీ కోరిక తీరేటట్లు లేదు

ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలనుందని మళ్లీ చెప్పాడు, కానీ కోరిక తీరేటట్లు లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్‌: . 'తనకు ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్ర‌మంటే ఎంతో ఇష్టమని, ఆయనతో కలిసి ఓ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని చేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు దర్శకుడు హరి. తమిళ మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి.

సింగం సీరీస్ తో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరి, కెరీర్ లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసినవి కేవలం 14 చిత్రాలు మాత్రమే. రేసీ స్క్రీన్ ప్లే తో పాటు ఫ్యామిలి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ లను తెరకెక్కించే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు.

Director Hari’s Intentions to work with NTR

సూర్య హీరో గా 'సింగం' సిరీస్‌లో వచ్చిన చిత్రం 'ఎస్‌3'. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలు. హరి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రంలో హరి మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు.

నేను ఎన్టీఆర్ తో పని చేయాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఎన్టీఆర్ కు కథ చెప్పటం జరిగింది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని ఆశిస్తున్నాను అని ఆయన గతంలోనూ ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.

మరి ఈ విషయం విన్న ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాబి చిత్రం అనంతరం త్రివిక్రమ్ తో ఆయన ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో పూర్తయ్యాక వినాయిక్ తో ఆయన సినిమా చేసే అవకాసం ఉంది. తమిళ దర్శకులతో మరి ఎన్టీఆర్ చేయటానికి పెద్ద ఇంట్రస్ట్ చూపటంలేదంటూ మరో ప్రక్క వార్తలు వస్తున్నాయి.

ఇక హరి, ఇన్నేళ్ల కెరీర్ లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయలేకపోయాడు. అయితే అందుకు కారణం ఏంటో కూడా చెపుతున్నాడు హరి. సూర్య, విక్రమ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హరి... విజయ్, అజిత్ లతో సినిమాలు చేయలేకపోయాడు. సింగం తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో విజయ్ తో సినిమా చేసేందుకు చర్చలు జరిపిన హరి, సరైన నిర్మాత దొరక్క పోవటంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం సింగం 3 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన హరి, విజయ్ మార్కెట్ రేంజ్ కు తగ్గ స్థాయిలో సినిమాను తెరకెక్కించే నిర్మాత దొరికితే సినిమా చేసేందుకు తాను సిద్ధమే అంటూ ప్రకటించాడు.

English summary
Director Hari said “I loved Temper very much and I wish I can do a powerful film with Tarak soon”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu