»   »  దర్శకుని ప్రేమలో హీరోయిన్?

దర్శకుని ప్రేమలో హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో-హీరోయిన్లు, దర్శకులు-హీరోయిన్లు, నిర్మాత-హీరోయిన్లు, టెక్నీషియన్లు-హీరోయిన్లు ప్రేమలో పడటం కొత్తేంకాదు. ఆ లైన్ తో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రకాష్ ఝా తాజాగా తీసిన చిత్రం ఖోయా ఖోయా చాంద్. త్వరలో విడుదల అవనున్న ఈ చిత్రం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ స్వర్గీయ గురుదత్ జీవిత నేపథ్యంలో రూపొందిందీ చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా సొహా అలీఖాన్ చేస్తుండగా హీరోగా షైనీ చేస్తున్నాడు. ఇందులో సొహా యువనటిగా చేస్తుండగా, షైనీ రచయిత, దర్శకుడిగా చేస్తున్నాడు. 1950-60లలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో హీరోయిన్ గా చేస్తున్న సొహా అలీఖాన్ నిజ జీవితంలో ఇప్పటికే రంగ్ దే బసంతీ హీరో సిద్ధార్థతో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే.

అపహరన్, గంగాజల్, మృత్యుదండ్, దాముల్, పరిణతి సినిమాలను తీసిన జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ ఝా ఖోయా ఖోయా చాంద్ సినిమా విడుదల తరువాత నిర్మించనున్న సినిమా రాజ్ నీతి. ఇందులో అజయ్ దేవగన్, నానా పటేకర్ చేస్తున్నారు.

Read more about: director love aoha ali khan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X