For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘అజ్ఞాతవాసి’ కాపీ వివాదం: టికెట్ బుక్ చేసుకున్న ఫ్రెంచి డైరెక్టర్... సర్వత్రా ఉత్కంఠ!

  By Bojja Kumar
  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా కాపీరైట్ వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే దర్శక నిర్మాతలకు 'టి-సిరీస్' కంపెనీ నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

  అజ్ఞాతవాసిపై 'మెగా' రిపోర్ట్ ?
  లార్గో వించ్

  లార్గో వించ్

  ‘అజ్ఞాతవాసి' చిత్రం ఫ్రెంచి మూవీ ‘లార్గో వించ్' చిత్ర కథకు కాపీ అనే ఆరోపణలు ఉన్నాయి. ‘లార్గో వించ్' హిందీ రీమేక్ రైట్స్ ‘టి-సిరీస్' సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ నుండి దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు అందినట్లు టాక్.

  టీజర్ విడుదలైన తర్వాత అనుమానాలు తెరపైకి!

  టీజర్ విడుదలైన తర్వాత అనుమానాలు తెరపైకి!

  ‘అజ్ఞాతవాసి' టీజర్ విడుదలైన తర్వాత అందులోని సీన్లు..... అనుమానాలు పెరగడానికి కారణం అయ్యాయి. దీంతో ‘టి-సిరీస్' సంస్థ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగింది.

  ‘అజ్ఞాతవాసి’ చిత్రం చూడటానికి సిద్ధమైన ఫ్రెంచి డైరెక్టర్

  ‘అజ్ఞాతవాసి’ చిత్రం చూడటానికి సిద్ధమైన ఫ్రెంచి డైరెక్టర్

  ఫ్రెంచిలో ‘లార్గో వించ్' చిత్రానికి దర్శకత్వం వహించిన జెరోమ్ సల్లే...... ఇండియన్ మీడియాలో వస్తున్న వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. నేను వెంటనే ‘అజ్ఞాతవాసి' టికెట్స్ బుక్ చేసుకుంటున్నానని, ఇండియన్ మీడియాలో వార్తల నేపథ్యంలో తనలోనూ ‘అజ్ఞాతవాసి'పై క్యూరియాసిటీ పెరిగిందని జెరోమ్ సల్లే ట్వీట్ చేశారు.

  దానికీ.. దీనికి పోలికలు ఉన్నాయా?

  దానికీ.. దీనికి పోలికలు ఉన్నాయా?

  ఫ్రెంచి మూవీ ‘లార్గో వించ్' చిత్రం.... ఓ కామిక్ బుక్ ఆధారంగా దర్శకుడు జెరోమ్ సల్లే అదే పేరుతో తెరకెక్కించారు. ఒక కోటీశ్వరుడి రహస్య దత్తపుత్రుడు తన తండ్రి చావుకు కారణమైన వారిని ఎలా పట్టుకున్నాడు అనే కాన్సెప్టుతో ఈ చిత్రం సాగుతుంది. అజ్ఞాతవాసి ట్యాగ్ లైన్ ‘'Prince In Exile' ఉండటం, టీజర్ కూడా అలానే ఉండటంతో ఆ కథ, ఈ కథ ఒకటే అనే అనుమానాలకు కారణమైంది. మరి ఈ అనుమానంలో నిజం ఎంతో సినిమా విడుదలైతే కానీ తెలియదు.

  టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్

  టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్

  ‘అజ్ఞాతవాసి' సినిమా తాము రీమేక్ రైట్స్ దక్కించుకున్న చిత్రానికి కాపీ అనే ఆరోపణలు రావడంతో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరిపారు. కాపీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.

  జాతీయ మీడియాలో హాట్ టాపిక్

  జాతీయ మీడియాలో హాట్ టాపిక్

  పవన్ కళ్యాణ్ హీరో కావడం, టి-సిరీస్ లాంటి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కావడంతో జాతీయ మీడియా సైతం ఈ కాపీరైట్ ఇష్యూపై స్పెషల్ పోకస్ పెట్టాయి. విషయం ఫ్రెంచి డైరెక్టర్ వరకు వెళ్లి అతడు కూడా అలర్ట్ అయ్యాడు.

  కాపీ అని తేలితే?

  కాపీ అని తేలితే?

  మరో వారం రోజుల్లో ‘అజ్ఞాతవాసి' సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పి వరకు అయితే త్రివిక్రమ్ నుండి ఎలాంటి స్పందన లేదు. తాను తప్పు చేయలేదనే ధీమా ఆయనలో కనిపిస్తోంది. ఏది ఏమైనా జనవరి 10 విషయం తేలనుంది. ఒక వేళ కాపీ అని తేలితే ఎలాంటి పరిణామాలు చోటు చేసకుంటాయో చూడాలి.

  హ్యాట్రిక్ మీద కన్నేసిన త్రివిక్రమ్

  హ్యాట్రిక్ మీద కన్నేసిన త్రివిక్రమ్

  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న 3వ సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు భారీ విజయం అందుకున్నాయి. ‘అజ్ఞాతవాసి' సినిమాతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు.

  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

  ‘అజ్ఞాతవాసి' సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైట్ సీన్ల విషయంలో కాంప్రైజ్ అయితే ‘యు' ఇస్తామని సెన్సార్ బోర్డు చెప్పినా త్రివిక్రమ్ వినలేదట.

  అంచనాలు భారీగా, బిజినెస్ అదే స్థాయిలో

  అంచనాలు భారీగా, బిజినెస్ అదే స్థాయిలో

  ‘అజ్ఞాతవాసి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయా ఏరియాల్లో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగింది. అన్ని ఏరియాలకు కలిపి ఇప్పిటి వరకు రూ. 150 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. సినిమా రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

  ఓవర్సీస్‌లో బాహుబలి రికార్డు బద్దలు

  ఓవర్సీస్‌లో బాహుబలి రికార్డు బద్దలు

  ఈ చిత్రం ఓవర్సీస్‌లో అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతోంది. ఈ విషయంలో ‘బాహుబలి' చిత్రాన్ని సైతం వెనక్కి నెట్టేసింది. రేపు విడుదలైన తర్వాత కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

  ఆడియోకు మంచి రెస్పాన్స్

  ఆడియోకు మంచి రెస్పాన్స్

  ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ‘బ‌య‌ట‌కొచ్చి చూస్తే టైమ్ ఏమో` ... , `గాలి వాలుగా...` అనే రెండు సాంగ్స్‌తో పాటు అనిరుధ్ ట్రిబ్యూట్ సాంగ్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేస్తున్నాయి.

  కొడకా సాంగ్ రికార్డులు

  కొడకా సాంగ్ రికార్డులు

  ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కొడకా కోటేశ్వర్ రావు' అనే పాట పాడారు. ఈ పాటకు యూట్యూబ్‍‌లో రెండ్రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టీజర్ ఇప్పటి వరకు 13 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

  English summary
  Jerome Salle took to Twitter to share his views on 'Agnyaathavaasi'. Surprisingly, The Filmmaker claimed he wishes to buy the ticket of the Telugu Flick out of curiosity to know if it's an unofficial remake of his project or not. 'I think I'm gonna buy a ticket (plane first than movie) #Curiosity #Agnyaathavaasi #LargoWinch,' he wrote.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more