»   » ఇక సరదాయే సరదా.... ఆ ఇద్దరూ కలిస్తే....! నమ్మలేని కాంబినేషన్ కి రెడీ అవ్వండి

ఇక సరదాయే సరదా.... ఆ ఇద్దరూ కలిస్తే....! నమ్మలేని కాంబినేషన్ కి రెడీ అవ్వండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాబు బంగారం' మొదలుపెట్టడానికి ముందు ఏడాదికి పైగా విరామం తీసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఐతే ఈ సినిమా మొదలుపెట్టగానే ఆయన సూపర్ స్పీడ్ అందుకున్నారు. ఆరు నెలల్లోనే 'బాబు బంగారం'ను ముగించేసి.. సుధ కొంగర దర్శకత్వంలో 'గురు' మీదికి వెళ్లిపోయాడు. ఇది రీమేక్ కూడా కావడంతో మరింత వేగంగా సినిమా పూర్తయిపోయింది. కేవలం మూడు నెలల వ్యవధిలో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమా అలా ముగిసిందో లేదో.. ఇలా తన తర్వాతి సినిమాకు శ్రీకారం చుట్టేశాడు వెంకీ. 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లూ మీకు జోహార్' సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లిపోతోంది.

ఈ నేపథ్యం లో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ తో సినిమాకి సిద్దమౌతున్నాడనే వార్త అభిమానుల్లో ఊహించనంత ఆనందానికి కారణం అయ్యింది. మొన్నటివరకూ కాస్త నీరసంగా ఉన్న వెంకీ కెరీర్ పిచ్చ ఊపు మీద నడుస్తోందిప్పుడు. వరుసగా విశ్రాంతి అన్నదే లేకుండా సినిమాలు చేయటం మొదలు పెట్టాడు వెంకీ.. ఇంతకీ క్రిష్ వెంకీ సినిమా కహానీ ఏమిటంటే.....

 సోషియో ఫాంటసీ:

సోషియో ఫాంటసీ:


సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కొంచెం రూటు మార్చి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం, గురు' వంటి సినిమాలే అందుకు నిదర్శనాలు. ఈ బాటలోనే వెంకీ ప్రస్తుతం మరో ప్రయోగాత్మక చిత్రానికి ఓకే చెప్పినట్టు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా పూర్తిగా సోషియో ఫాంటసీ నైపథ్యంలో ఉండనుందని కూడా తెలుస్తోంది.

 క్రిష్:

క్రిష్:


ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేది మరెవరో కాదు భిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన క్రిష్. ‘కంచె, కృష్ణవందే జగద్గురుమ్, గమ్యం, వేదం' వంటి సినిమాలతో ఇప్పటికే తన వైవిధ్యాన్ని చాటుకున్న క్రిష్ ప్రస్తుతం బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి'ను డైరెక్ట్ చేస్తున్నాడు.

 వెంటనే గ్రీన్ సిగ్నల్ :

వెంటనే గ్రీన్ సిగ్నల్ :


కొద్దిరోజుల క్రితమే క్రిష్ వెంకటేష్ కు ఈ సోషియో ఫాంటసీ కథను వినిపించగా వెంకీ కూడా కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వెంకీ ప్రస్తుతం ‘గురు' షూటింగును పూర్తి చేసి ‘నేను శైలజ' ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాకి సిద్దమవుతున్నాడు.

 అధికారిక సమాచారం లేదు:

అధికారిక సమాచారం లేదు:


ఈ సినిమా పూర్తైన వెంటనే క్రిష్ సినిమా మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై క్రిష్, వెంకటేష్ ల నుండి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటి దాకా బయటకు రాలేదు. త్వరలోనే ఇద్దరిలో ఎవరో ఒకరు దృవీకరించొచ్చు అని అనుకుంటున్నారు.

 గౌతమీపుత్ర శాతకర్ణి:

గౌతమీపుత్ర శాతకర్ణి:


‘గమ్యం' నుంచి ప్రతిసారీ వైవిధ్యమైన ప్రయాణమే చేస్తున్న క్రిష్.. నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి'ని పూర్తి చేస్తూనే.. తన తర్వాతి సినిమా కోసం ఇప్పటికే పని మొదలుపెట్టేశాడు. ముందు తన నెక్స్ట్ ప్రాజెక్టును బాలీవుడ్లో చేయాలనుకున్న క్రిష్..

 కథ బాగా నచ్చిందట:

కథ బాగా నచ్చిందట:


ఆ ఆలోచనను విరమించుకుని వెంకీకి ఓ కథ వినిపించినట్లు సమాచారం. అది ఒక సోషియో ఫాంటసీ కథ అని సమాచారం. వెంకీకి కూడా ఆ కథ బాగా నచ్చిందట. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా ఖాయం అంటున్నారు. వెంకీ ఇంతకుముందు రానాతో క్రిష్ తీసిన ‘కృష్ణం వందే జగద్గురుం'లో ఓ పాటలో తళుక్కుమన్న సంగతి తెలిసిందే.

English summary
Noted director Krish is making historical film Gauthamiputra Sathakarni with Balakrishna. Next, he plans to do a socio-fantasy film. He met Venkatesh and narrated the story and Venkatesh reportedly said OK
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu