twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ని పొగడ్తల్లో ముంచెత్తాడు,మళ్లీ ఏమన్నా ప్లానింగా

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాహో గోన గన్నారెడ్డి...మనకో కొత్త రాబిన్ హుడ్ పరిచయం అయ్యాడు.నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా...బన్నీ..అదరకొట్టేసావ్ అంటున్నారు దర్శకుడు క్రిష్. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి చిత్రం ఇప్పుడు అంతటా ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ నేపధ్యంలో క్రిష్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసారు.

    అయితే ఇప్పుడీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. క్రిష్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో గతంలో వేదం చిత్రం వచ్చింది. ఇప్పుడు మరో చిత్రం ఏమన్నా వీరి కాంబినేషన్ లో ప్లానింగ్ జరుగుతోందా అనే చర్చ మొదలైంది.

    క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం' కంచె' చిత్రం విషయానికి వ స్తే....

    . వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి చెప్పినట్లుగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కా లేదు. నవంబర్ 6కి వాయిదా వేసినట్లు హీరో వరుణ్ తేజ అఫీషియల్ గా ప్రకటన చేసారు. అయితే కారణమేంటనేది చెప్పలేదు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనేది త్వరలో తెలియచేస్తానని అన్నారు.

    Director Krish tweet about Allu Arjun's character in Rudrama devi

    రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు. అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్‌ చెప్పారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబా, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్‌భట్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్.

    ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఇందులో భాగంగా చిత్రం మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఇక్కడ ఆ వీడియోని చూడండి.

    మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయింది. ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "Absolute Telugu Cinemas" వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.

    ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇదిగో...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రామ్ చరణ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ డైరెక్టర్‌ను సినిమాలు చేయాలని అడగలేదు. కానీ నేను ఐదేళ్లుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నాను. నేను, ప్రకాష్, రానా, క్రిష్ ఒక బ్యాచ్. ఒక రోజు క్రిష్ కథ ఉందని చెబితే ఇంటికి రమ్మన్నా. వచ్చి కథ చెప్పాడు. సెకండాఫ్ చెప్పడానికి రాలేదు. ఆ సబ్జెక్టు‌కి నేను సెట్ కానని అనుకున్నాడా? లేక ఆ కథనే వరుణ్ తేజ్ తో తీసాడా? ఒక వేళ అదే కథని వరుణ్‌తో తీసి ఉంటే క్రిష్ అయిపోతాడు. ఈ కథ కోసం ఎన్నో నెలలు జార్జియాలో షూటింగ్ చేసారు. కెమెరామెన్ బాగా చేసారు. వరుణ్ హైట్ చూస్తుంటే నాకు అన్నయ్యలాగా ఉన్నాడు. మా ఫ్యామిలీలో మంచి అందగాడే కాదు, మంచి గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు. నాక్కూడా అలాంటి గట్స్ రావాలి. క్రిష్‌కి కూడా అలాంటి గట్స్ నచ్చి నాతో సినిమా చేయాలి' అని వ్యాఖ్యానించారు.

    దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం జార్జియా గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్ డ్రాపుకు తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వండర్ ఫుల్ ఎఫర్టె పెట్టి పని చేసారు. రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన ఈ సినిమాకు చింతన్ భట్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మనకు చాలా మంది దర్శకులు ఉన్నా ఎందుకో రెండో ప్రపంచ యుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ భిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. చెప్పని కథలను చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్' అన్నారు.

    వరుణ్ తేజ్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నా టీమ్ అందరికీ దన్యవాదాలు. పండగరోజు అందరూ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. అభిమానులందరూ నా ప్యామిలీ. పెదనాన్న చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేను. మంచి సినిమా చేస్తున్నాను. నాన్న పరువు నిలబడెతాను. సినిమా విడుదలైన తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ కి చూపిస్తాను. సినిమా ఎలా ఉందని అడుగుతాను. అభిమానులు గర్వ పడేలా సినిమా ఉంటుంది. అన్నారు.

    సిరివెన్నెల మాట్లాడుతూ... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా మనల్ని 1945లోకి తీసుకెళ్తాయి. యుద్దంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలోని మనిషి దేని కొట్టుకుంటున్నాడో తెలియని దాన్ని యుద్ధం రూపంలో చెప్పడం, అందులోనే ప్రేమను కూడా చెప్పడం, ఈ మనిషి తాలూకు వైరుధ్యాన్ని చూపడం నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. వరుణ్ ని చూస్తుంటే హాలీవుడ్ నటున్నిచూసినట్లు ఉంది. రెండో సినిమాకే ఇలాంటి సినిమాలో అవకాశం దొరకడం అదృష్టం అన్నారు.

    రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అద్భుత ప్రేమ కథను మిళితం చేశామని దర్శకుడు క్రిష్‌ చెప్పారు. చిత్రంలో కనిపించే 1940ల నాటి దృశ్యాలు, యుద్ధ సన్నివేశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    Director Krish tweet about Allu Arjun's character in Rudrama devi

    ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది . అలాగే...స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని ...కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తేదీ మరేదో కాదు....అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది.

    ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.

    ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.

    ‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

    రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది.

    అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్న చిత్రం లోఫర్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. లోఫర్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

    English summary
    allu arjun, rudramadevi, kanche, varun tej, mukunda, krish, puri jagannath, tollywood, వరుణ్ తేజ్, ముకుంద, టాలీవుడ్, క్రిష్, పూరి జగన్నాథ్, కంచె, రుద్రమదేవి, అల్లు అర్జున్ Krish Jagarlamudi ‏ tweeted: And, Saho Ganna Reddy. - - "Gona Ganna Reddy" - - alluarjun at his best. Our New #RobinHood. Take a bow Bunny.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X