»   » రకుల్, రాశిఖన్నా, లక్ష్మీ ప్రసన్న, ప్రజ్ఞా జైశ్వాల్..అంతా ఓ చోట చేరి (క్రిష్ పెళ్లి ఫొటోలు)

రకుల్, రాశిఖన్నా, లక్ష్మీ ప్రసన్న, ప్రజ్ఞా జైశ్వాల్..అంతా ఓ చోట చేరి (క్రిష్ పెళ్లి ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్ అంటూ... క్రిష్.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని ఇస్తున్నారు. రమ్య.. ఓ డాక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇద్దరి వృత్తులూ భిన్నమైనప్పటికీ చేస్తున్నది మాత్రం సేవే. ఈ ఇద్దరూ నిన్న ఆదివారం రాత్రి ఒకింటివాళ్లు అయ్యారు.

వివరాల్లోకి వెళితే...ప్రముఖ దర్శకుడు క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) వివాహం డా.రమ్యసాయితో హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య రాత్రి 9గంటల 5నిమిషాలకి జీలకర్ర, బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటైంది.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో జరిగిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, డా. రమ్యసాయిల వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

''దేవతలే బంధువుల్లా వస్తారంట... మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే... మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు''...

నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ పంపిన ఆహ్వానాన్ని అందుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

'గమ్యం' నుంచి 'కంచె' వరకూ విలక్షణ చిత్రాలు తీసిన దర్శకుడు క్రిష్ తన వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కూడా కొత్తదనం చూపించారు.ఇంత ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఎవరికి మాత్రం వెళ్లాలని ఉండదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, రామ్‌, గోపీచంద్‌, కార్తి, శ్రీకాంత్‌, సుమంత్‌, సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి వచ్చారు.

ఇక హీరోయిన్స్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాశీ ఖన్నా, ప్రగ్యాజైశా, తెదేపా నేత నారా లోకేష్‌, లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. తమిళ, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన జంటని ఆశీర్వదించారు.

స్లైడ్ షోలో పెళ్లి ఫొటోలు చూడండి..

రకుల్

రకుల్


క్రిష్ వివాహ వేడుకలో స్టార్ హీరోయిన్ రకుల్ ఎంట్రీ ఇలా..

అదిరింది

అదిరింది


క్రిష్ వివాహ వేడుకలో రకుల్ ఎంట్రీనే అదిరింది కదూ

వావ్

వావ్


క్రిష్ వివాహ వేడుక విచ్చేసిన రకుల్ ని చూసి వావ్ అనకుండా ఉండలేరు

ఆనందోత్సాహం

ఆనందోత్సాహం

క్రిష్ వివాహ వేడుకకు వస్తూనే రకుల్ అందరినీ విష్ చేస్తూ కనిపించారు

రకుల్

రకుల్

రకుల్ రావటంతో నిజమైన వేడుక మొదలైనట్లైంది

నవ్వుతూ

నవ్వుతూ


... క్రిష్ వివాహ వేడుక కు హాజరయ్యిన ఈమె ఎవరో గుర్తు పట్టారా

ఫొటోలకు స్టిల్స్

ఫొటోలకు స్టిల్స్


హీరోయిన్ కమిలినీ..ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ ఇలా కనిపించారు

గమ్యంలో

గమ్యంలో

క్రిష్ డైరక్ట్ చేసిన గమ్యం సిమిమాలో కమిలినీ హీరోయిన్

మంచు లక్ష్మి ప్రసన్న ఎంట్రీ

మంచు లక్ష్మి ప్రసన్న ఎంట్రీ


మంచు లక్ష్మి ప్రసన్న ఎంట్రీ ఇలా ఇచ్చారు

పసన్న సందడి

పసన్న సందడి

లక్ష్మి ప్రసన్న వస్తూంటే ఆ సందడే వేరు, ఆ లుక్కేవేరు

విషెష్

విషెష్


లక్ష్మీ ప్రసన్న...నూతన దంపతులకు బెస్ట్ విశెష్ తెలియచేసారు

ఆటోగ్రాఫ్ లు

ఆటోగ్రాఫ్ లు


లక్ష్మీ ప్రసన్నకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెళ్లిలోనూ..

సెల్ఫీ

సెల్ఫీ


ఒక సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు లక్ష్మీ ప్రసన్నతో..

కంచె హీరోయిన్

కంచె హీరోయిన్

క్రిష్ డైరక్ట్ చేసిన కంచె హీరోయిన్ ప్రజ్ఞా వచ్చింది ఇలా

వెనక

వెనక


ప్రజ్ఞా జైశ్వాల్ వెనక కమిలినీ ముఖర్జీ వస్తోంది...గమనిచండి

ఏదో చెప్తోంది

ఏదో చెప్తోంది

హీరోయిన్ ప్రజ్ఞా జైశ్వాల్..ఈ కొత్త జంటను ఆశ్వీరదించటానికి వస్తూ..

అదుర్స్

అదుర్స్


ఈ వివాహానికి వచ్చిన ప్రజ్ఞా జైశ్వాల్ లుక్ అదిరింది కదూ

క్లోజ్ లో

క్లోజ్ లో


ప్రజ్ఞా జైశ్వాల్ ని మరింత క్లోజ్ లో ఇక్కడ చూడండి మరి..

ఫ్యాన్స్

ఫ్యాన్స్

లక్ష్మీ ప్రసన్నను ఫ్యాన్స్ చుట్టుముట్టిన క్షణాలు ఇవి

హేమ

హేమ

క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ...ఈ వివాహ వేదికలో ...

ప్రముఖ నిర్మాత

ప్రముఖ నిర్మాత


తెలుగులో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఇలా ఈ పెళ్లికి వచ్చి

రావికొండలరావు

రావికొండలరావు


ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు రావికొండలరావు గారు...

సీరియస్

సీరియస్


ఆర్ నారాయణ మూర్తి ఏదో సీరియస్ గా చెప్తున్నట్లున్నారు.

వెనక

వెనక


ఆర్ నారాయణ మూర్తి వెనక కోన వెంకట్ ని ,గోపీ మోహన్ ని గమనిచండి

కోట

కోట


ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు కోట శ్రీనివాసరావు గారు..ఈ వివాహ వేదిక వద్ద

దిల్ రాజు

దిల్ రాజు


ప్రముఖ నిర్మాత దిల్ రాజు ...క్రిష్ వివాహానికి ఇలా తరలి వచ్చారు.

సెల్ఫీ

సెల్ఫీ


ఆర్.నారాయణ మూర్తితో సెల్ఫీలు దిగుతూ...సి..

నిర్మాత

నిర్మాత


ప్రముఖ నిర్మాత బి.వియస్ ఎన్ ప్రసాద్ ఇలా ఈ పెళ్లికి తరలి వచ్చారు.

రాజమౌళి

రాజమౌళి


నిర్మాత కొర్రపాటి సాయి, రాజమౌళి కలిసి ఇలా ...వివాహానికి వచ్చారు

గోపీచంద్

గోపీచంద్

యాక్షన్ హీరో గోపిచంద్..ఈ వివాహానికి విచ్చేసారు

ఇద్దరు డైరక్టర్స్

ఇద్దరు డైరక్టర్స్


ప్రముఖ దర్శకుడు బిగోపాల్, వైవియస్ చౌదరి ఇద్దరూ...

ఫొటో

ఫొటో


ఈ దర్శకుల ఇద్దరితో కలిసి ఫొటో దిగారు అభిమానులు

సంపూ

సంపూ


ఈ వివాహానికి కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు విచ్చేసారు

సెల్ఫీలు

సెల్ఫీలు


సంపూర్ణేష్ బాబు తో కలిసి సరదాగా సెల్ఫీలు దిగారు ఫ్యాన్స్

స్పెషల్ ఎట్రాక్షన్.

స్పెషల్ ఎట్రాక్షన్.


ఈ వివాహంలో సంపూకు ఓ స్పెషల్ ఎట్రాక్షనే మరి..

English summary
Director Krish Jagarlamudi got married with Ramya. No of celebrities have attended to the wedding Krish wedding ceremony and blessed the couple. Many Politicians have attended the Krish Marriage. Here you can checkout the Director Krish Wedding Images.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu