»   »  జెడీ చక్రవర్తి గురించి కృష్ణవంశీ ఇలా చెప్పుకొచ్చారు

జెడీ చక్రవర్తి గురించి కృష్ణవంశీ ఇలా చెప్పుకొచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస ఫ్లాఫ్ ల తర్వాత దర్శకుడు కృష్ణ వంశీ చేస్తున్న చిత్రం 'నక్షత్రం'. ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ సినిమా కోసం తన బలాలని అన్నిటినీ వాడుతున్నారు... అన్ని విధాల కష్టపడుతున్నాడు కృష్ణవంశీ. సినిమాలోని ప్రతి అంశంలో కొత్తదనం, ప్రేక్షకులకు థ్రిల్ ఉండేలా చూస్తున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం తన పాత ప్రాణ మిత్రుడు జెడి చక్రవర్తిని తీసుకున్నారు వంశీ.

Director Krishnavamsi thanks JD Chakravarthy

హైదరాబాద్లో సినీ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి జెడి, కృష్ణవంశీ ప్రాణ మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గులాబీ' చిత్రం పరిశ్రమలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. అలాంటి వీరి కలయికను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ నక్షత్రం చిత్రంలో చూడబోతున్నాం. ఇకపోతే పోలీసుల జీవితాల మీద, వాళ్ళ సిన్సియారిటీ మీద రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్, రెజినాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్రల్లో మెప్పించున్నారు.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం జేడీ చక్రవర్తిని కృష్ణవంశీ ఎంపిక చేసారు. కృష్ణవంశీ - జేడీ చక్రవర్తి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గులాబి' చిత్రాన్ని చాలామంది ఇప్పటికీ మరిచిపోలేదు. 'నక్షత్రం' సినిమాకి జేడీ చక్రవర్తి పాత్ర హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పోలీసు జీవితాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.

English summary
Twenty years later,Director Krishnavamsi roped in Chakravarthy in his new directorial venture called 'Nakshatram'. This movie stars Sundeep Kishan as hero and Sai Dharam Tej in cameo role. For a small but important role, Krishnavamsi brought in JD.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu