»   » హీరో పెళ్లి,నా రోడ్డు ప్రమాదం...అందుకే లేటు

హీరో పెళ్లి,నా రోడ్డు ప్రమాదం...అందుకే లేటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2014లోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాం. అయితే హీరో ఆది పెళ్లితో పాటు, నాకు జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. . ‘గరం' ప్రయాణంలో నా స్నేహితుడు నాగిరెడ్డిని కోల్పోయా. అది నాకు తీరని లోటు. ఈ సినిమాను తనకు నివాళిగా అందిస్తున్నా అంటున్నారు మదన్.

‘ఆ నలుగురు' , ‘గుండె ఝల్లుమంది', ‘ప్రవరాఖ్యుడు' లాంటి దర్శకుడు మదన్.. తాజాగా ఆది హీరోగా ‘గరం' తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గరం' లేటవటానికి కారణం ఇలా చెప్పుకొచ్చారు.


Director Madan about his latest Garam

మదన్ మాట్లాడుతూ...‘‘సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ అనుకోకుండా వచ్చిందే. ‘ప్రవరాఖ్యుడు' తర్వాత ఇక సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుదామనుకొన్నా. అందుకు వ్యక్తిగత విషయాలే కారణం. ఎప్పుడైనా సరే పనిచేసిన వెంటనే ఫలితాన్ని కోరుకుంటాం. ‘ప్రవరాఖ్యుడు' విషయంలో మాత్రం రెండు మూడేళ్ల తర్వాత ఫలితం వచ్చింది.


యూట్యూబ్‌లో ఆ సినిమా చూసి ఇప్పుడు అభినందిస్తున్నారంతా. ఆ సినిమా విడుదలైన వెంటనే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఉద్యమాలు మొదలయ్యాయి. దీంతో ప్రేక్షకులకు చేరువ కాలేదు. విచిత్రంగా గత రెండేళ్ల నుంచి ఎవరో ఒకరు ఫోన్‌ చేసి ‘ప్రవరాఖ్యుడు'ని గుర్తు చేస్తున్నారు. అవకాశాల్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నారు'' అని చెప్పుకొచ్చారు.


Director Madan about his latest Garam

చిత్రం గురించి చెప్తూ...‘‘ఇందులో ఆది వరాల బాబు అనే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. పరిణతి లేని ఒక పల్లెటూరి కుర్రాడైన వరాలబాబు లక్ష్యం ఏమిటి? అందుకోసం ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. ఆది నమ్మకమే ‘గరం' సినిమా. వరాల బాబు పాత్రను అంతగా ప్రేమించాడు తను.


ఇటలీలో డోలమైట్స్‌ అనే ప్రాంతంలో ఎత్తైన మంచు కొండపై ఓ షాట్‌ని తీయాలనుకొన్నాం. ఆ షాట్‌ కోసం ఆది కొండపై రోజంతా అక్కడే ఉన్నాడు. కానీ ఆ షాట్‌ తీయడం కుదర్లేదు. రెండో రోజు ఇక ఆ షాట్‌ వద్దనుకొన్నాం. కానీ అందరికంటే ముందుగా ఆది కొండపైకి ఎక్కి ఆ షాట్‌ తీయించాడు. నిర్మాతగా సాయికుమార్‌గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అగస్త్య సంగీతం, సురేందర్‌ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన బలం'' అని అన్నారు.

English summary
Director Madan revels reasons behind his latest Garam late release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu