»   » మణిరత్నం ఇంటర్వూ : సినిమా.. ఆలోచనలు

మణిరత్నం ఇంటర్వూ : సినిమా.. ఆలోచనలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మెట్రోనగరం ముంబై నేపథ్యంలో 'ఓకే బంగారం' పేరుతో మరో ప్రేమకథని తెరకెక్కించారు. దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మేనన్‌ జంటగా నటించిన ఆ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మణిరత్నం మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మొదటి నుంచీ ...మణిరత్నం ఓ జోనర్‌కి పరిమితం కాలేదు. స్నేహం, ప్రేమ, దేశభక్తి... ఇలా ప్రతీ నేపథ్యాన్నీ ఆయన స్పృశించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇప్పుడు 'ఓకే బంగారం' తో అలరించటానికి ముందుకు వస్తున్నారు. మొదటి నుంచీ తెలుగులోనూ మణిరత్నానకి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.


ఇక ఇప్పటికే విడుదలైన చిత్రం ఆడియో సూపర్ హిట్టైంది. గతంలో ఏ. ఆర్. రెహమాన్, మణిరత్నంల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ఆల్బంలలానే ఓకే బంగారం ఆడియో ఉండటంతో అభిమానులకు పండగ చేసుకున్నట్లైంది. మొత్తం తొమ్మిది పాటలున్న ఈ ఆల్బం మణిరత్నం మార్క్‌తో సాగింది. తమిళంలో వైరముత్తు ఈ పాటలకు సాహిత్యాన్ని అందించగా, తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ బాధ్యతను నిర్వహించారు. పిసి శ్రీరామ్ కెమెరా వర్క్,ఎఆర్ రహమాన్ సంగీతం హాంట్ చేస్తోంది.


స్లైడ్ షోలో మణిరత్నం ఇంటర్వూ...


ముంబై నేపథ్యంలోనే మీ సినిమాలు...కారణం

ముంబై నేపథ్యంలోనే మీ సినిమాలు...కారణం

అక్కడ నేను కొన్నేళ్లపాటు చదువుకొన్నా. దానికితోడు మన అభివృద్ధిని, ఆధునికతను ప్రతిబింబించే ఓ ప్రధాన నగరం అది. అందరికీ సంబంధించిన ఓ కథని అలాంటి నేపథ్యంలో సులభంగా చెప్పొచ్చన్నది నా అభిప్రాయం. అరవయ్యేళ్ల వయసులో యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే సినిమా తీశారు...


మీ వయస్సు ఎంతో..

మీ వయస్సు ఎంతో..

నేనిప్పటికీ 22ఏళ్ల కుర్రాణ్నే (నవ్వుతూ).లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీదే కానీ..

లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీదే కానీ..

'ఓకే బంగారం' సహజీవనం నేపథ్యంలో సాగే చిత్రంగా చెబుతున్నారు. అయితే సహజీవనం గురించి మాత్రమే నేనీ సినిమా తీయలేదు. ఇందులో పెళ్లి గురించి ప్రధానంగా ప్రస్తావించాం. ప్రస్తుతం సమాజం ఎలా ఉంది? యువతరం నడవడిక, ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇందులో చూపిస్తున్నా.


కథ గురించి ఎలాంటి పరిశోధన?

కథ గురించి ఎలాంటి పరిశోధన?

పరిశోధన అనేది జీవితంలో ఓ భాగం. ఎప్పుడూ చేస్తూ ఉండాల్సిందే. కథ రాసుకొనేటప్పుడు కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన పాత్రని తీర్చిదిద్దాలన్నప్పుడు దాని గురించి పరిశోధన చేయాల్సిందే. అయితే ఆ పాత్ర జీవితం, దాని తాలూకు భావోద్వేగాల గురించి ఒక అవగాహనకు రావాలంటే ఆ పాత్రను పరిపూర్ణంగా అనుభవించాల్సిందే.


లైవ్ రికార్డు చేసారన్నారు..

లైవ్ రికార్డు చేసారన్నారు..

ఈ సినిమాని చిత్రీకరిస్తున్న సమయంలోనే తమిళంలో సంభాషణల్ని రికార్డ్‌ చేశాం. ఆ విషయంలో నేను గర్వపడుతున్నా. సెట్‌కి వెళ్లే సమయంలోనే అలా లైవ్‌లో రికార్డ్‌ చేయాలని నిర్ణయించుకొన్నా, చేశా. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగని భయపడి వెనకడుగు వేయకూడదు. ఆ మాటకొస్తే ఇబ్బందులు లేనిదెక్కడ? సినిమా చిత్రీకరణ కష్టంతో కూడుకొన్న పనే. మేం అనుకొన్నది చేశాం. భవిష్యత్తులోనూ ఈ ప్రయోగం కొనసాగిస్తానేమో!


జాగ్రత్తలు

జాగ్రత్తలు


ప్రత్యేకంగా ఫలానా వాళ్లకి నచ్చేలా ఉండాలని నేను కథలు రాసుకోను. నన్ను నేను దృష్టిలో ఉంచుకొని కథ రాసుకొంటాను.ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి చేయటంలో...

ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి చేయటంలో...

నాకు ఎలాంటి రాగాలు తెలియవు. రెహమాన్‌ సినిమాకి ఏది అవసరమైతే అది సమకూరుస్తుంటారు. నేను ఓకే చేస్తుంటానంతే.చాలా కాలం తర్వాత పి.సి.శ్రీరామ్‌తో పనిచేశారు..

చాలా కాలం తర్వాత పి.సి.శ్రీరామ్‌తో పనిచేశారు..

తను నా సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక రకంగా భాగమవుతూనే ఉంటారు. తను నా సినిమాకి పనిచేయనీ, చేయకపోనీ నా కథల గురించి చర్చిస్తూనే ఉంటా.


సీతారామ శాస్త్రి గారితో...

సీతారామ శాస్త్రి గారితో...

'ఓకే బంగారం'కి సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. నా సినిమాలకి పాటలు రాసే వేటూరి గారి ఫ్లేవర్‌లోనే సీతారామశాస్త్రిగారు అద్భుతమైన పాటలు ఇచ్చారు.


English summary
Mani Ratnam's Ok Bangaram movie will be releasing tomorrow.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu