For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భలే భలే మగాడివోయ్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన మారుతి.. బన్నీతో సినిమా అంటే?

  |

  కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు మారుతి నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ గట్టిగానే మెయింటైన్ చేస్తున్నాడు. సాధారణంగా ఈ దర్శకుడు ఒక సినిమా అయిపోగానే మరో సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకురావాలా అని గట్టిగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కరోనా కారణంగా కొంత గ్యాప్ రావడంతో సైలెంట్ గానే ఉన్నాడు. ఇక గురువారం మారుతి పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అలాగే తన తదుపరి సినిమాపై కూడా ఈ స్టార్ దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

  నిర్మాతగా కూడా మంచి లాభాలను అందుకొని..

  నిర్మాతగా కూడా మంచి లాభాలను అందుకొని..

  ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రమ్ వంటి సినిమాలతోనే మారుతి తన టాలెంట్ ఏంటో నీరూపించుకున్నాడు. తక్కువ బడ్జెట్ లోనే జనాలను అమితంగా ఆకట్టుకునే కామెడీ కథలను రాసుకొని నిర్మాతగా కూడా మంచి లాభాలను అందుకున్నాడు. చిన్న హీరోలతోనే కాకుండా మెల్లమెల్లగా స్టార్ హీరోలతో కూడా వర్క్ చేయడం అలవాటు చేసుకున్నాడు. గత కొంత కాలంగా మారుతి హిట్ మూవీకి సంబంధించిన ఒక సీక్వెల్ రూమర్ వైరల్ అవుతోంది.

  ఆ హిట్ సినిమాకు సీక్వెల్ లేనట్లే..

  ఆ హిట్ సినిమాకు సీక్వెల్ లేనట్లే..

  మారుతి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో భలే భలే మగాడివోయ్ ఒకటి. నాని కెరీర్ కి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకి సీక్వెల్ రానున్నట్లు గత రెండు మూడేళ్ళ నుంచి అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఇక ఫైనల్ గా మారుతి ఆ విషయంపై వివరణ ఇచ్చాడు. నిజానికి సీక్వెల్ చేయాలని అనుకున్నాడట. కానీ మళ్ళీ అదే కాన్సెప్ట్ లో సినిమా చేస్తే కొత్తగా ట్రై చేశాము అనే ఫీల్ ఉండదని.. చేస్తే ఏదైనా కొత్తగా ట్రై చేయాలను అనుకున్నా. అందుకే మళ్ళీ ఆ కథ గురించి ఆలోచించలేదని చెప్పాడు. ఇక ఆయన చెప్పిన విధానం బట్టి చూస్తే ప్రస్తుతానికైతే ఆ హిట్ మూవీకి సీక్వెల్ లేదని అనిపిస్తోంది.

  అల్లు అర్జున్ తో సినిమా..?

  అల్లు అర్జున్ తో సినిమా..?

  అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మారుతి మేమిద్దరం చాలా కాలంగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నట్లు చెప్పాడు. బన్నీ తన విజయాన్ని కష్టాన్ని చాలా దగ్గరగా చూశాడని నా మార్క్ కామెడీ కథలను మెచ్చుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పాడు. ఇక బన్నీతో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను గతంలోనే మారుతి అబద్ధమని చెప్పేశాడు. స్నేహం వేరు సినిమా వేరు అంటూ ఇంకా బన్నీకి స్థాయికి తగిన కథ రెడీ చేయలేదని అన్నాడు.

  Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
  తరువాత సినిమా స్టార్ హీరోతోనే..

  తరువాత సినిమా స్టార్ హీరోతోనే..

  అసలైతే మారుతి ఈ ఏడాది మార్చ్ లోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ వలన పరిస్థితులు మారడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక తొందరపడకుండా ఈ లాక్ డౌన్ లోనే మరిన్ని మంచి కథలు రాసుకున్నాడట. ఇప్పటికే స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఒక కథను నిర్మాతలకు చెప్పాడట. డిసెంబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని చెబుతున్నారు. అలాగే మారుతి ఓటీటీలో కూడా కామెడీ కథలతోనే రాబోతున్నారట. ఆహా యాప్ కోసం ఒక కథను రాసినట్లు చెప్పిన మారుతి త్వరలోనే అల్లు అరవింద్ నుంచి స్పెషల్ ఎనౌన్స్మెంట్ వస్తుందని వివరణ ఇచ్చారు.

  English summary
  It is a well known fact that in the world of social media, negative comments are more prevalent than positive comments. Criticisms of anything OK with the subject are common. Recently, Anushka Sharma's pregnancy also came as a surprise to everyone. The Telugu director Maruti fired for the criticism. Tried to give the counter in his own style.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X