twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీశ్‌ మైనస్‌లూ నాకు తెలుసు

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి. అల్లు శిరీష్ హీరోగా ఆయన ఇప్పుడు 'కొత్త జంట' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇలా చెప్పారు.

    'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగానూ బిజీనే. ఆయన సంస్థ నుంచి ఏడు సినిమాలు రాబోతున్నాయి. మంగళవారం మారుతి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

    కొత్త జంట గురించి చెప్తూ....ఇప్పుడు నేను చేస్తున్న 'కొత్త జంట' చాలా క్లీన్ ఫిల్మ్. ధూమపానం, మద్యపానానికి సంబంధించిన చిన్న సన్నివేశమే కాదు, కనీసం వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా సినిమాలో కనిపించవు. కానీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఆగస్ట్ 2న షూటింగ్ ప్రారంభించాం. గీతా ఆర్ట్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరం మొనగాళ్లం కాదు. మనలో ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉంటాయి అన్నారు.

    తదుపరి చిత్రాలు గురించి చెప్తూ.. డి.వి.వి. దానయ్య, బన్నీ వాసు, బెల్లంకొండ సురేశ్, డి.వి.వి. దానయ్య, 'జులాయి' నిర్మాత రాధాకృష్ణ, దిల్ రాజు బేనర్‌లలో చేసేందుకు ఒప్పుకున్నా. అడ్వాన్సులు కూడా తీసుకున్నా. వీటితో పాటు మా గుడ్‌సినిమా గ్రూప్‌కీ ఓ సినిమా చేయాల్సి ఉంది. 'ప్రేమ కథా చిత్రమ్'ను బాలీవుడ్‌లో డైరెక్ట్ చేయమని అడుగుతున్నారు. జి. ఆదిశేషగిరిరావు, యుటీవీ బేనర్ సంయుక్తంగా ఆ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటి తో పాటు నా నిర్మాణ భాగస్వామ్యంలో 'లవ్ యు బంగా రం', 'గ్రీన్‌సిగ్నల్', 'లవర్స్' సినిమాలు రాబోతున్నాయి అన్నారు.

    ఇక మారుతి ఫలానా సినిమాలు మాత్రమే తీస్తాడన్న బ్రాండ్‌ నాకొద్దు. అందుకే ఎప్పటి కప్పుడు కథలు మార్చుకొంటూ సినిమాలు తీస్తున్నా. 'కొత్త జంట' అలాంటిదే. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకొంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ. 50శాతం చిత్రీకరణ పూర్తయింది''. ''ఆఫీసు బాయ్‌గా పనిచేశా. నెంబర్‌ ప్లేట్లు రాశా. ఇప్పుడు వందమందికి పని కల్పించే స్థితికి చేరుకొన్నా. ఇదంతా నాకు సినిమానే ఇచ్చింది'' అంటున్నారు మారుతి.

    English summary
    Successful director Maruthi is celebrating his birthday today. Maruthi says once he worked as an office boy and even wrote number plates. He thanked film industry for rewarding him with success, encouraging his small youthful entertainers like ‘Bus Stop’, ‘Ee Rojullo’, ‘Prema Kadha Chitram’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X