twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ సర్.. పబ్జీ గేమ్‌కే ఇలా.. అవకతవకల వల్ల ఫెయిల్ అయితే తట్టుకోగలరా .. మారుతి!

    |

    తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలకు విద్యార్థులు బలైపోతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియర్ ఫలితాల తర్వాత విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు పెను సంచలనంగా మారింది. తెలంగాణ ఇంటర్ బోర్డులో తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఘటనపై టాలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సినీ దర్శకుడు మారుతి విద్యార్థుల ఆత్మహత్యలపై మరోసారి స్పందించాడు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పరీక్షలు మన నైపుణ్యానికి కొలమానం కాదు అని మారుతి ఇదివరకే ఓ సారి ట్వీట్ చేశారు.

     పబ్జీ గేమ్‌కే ఇలా

    పబ్జీ గేమ్‌కే ఇలా

    మారుతి తాజాగా ట్విట్టర్ లో స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఓ అప్పీల్ చేశాడు. ప్రస్తుతం పబ్జి గేమ్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. మారుతి దానిగురించి ప్రస్తావిస్తూ.. పబ్జి గేమ్ లో విఫలమైతేనే కొందరు పసిమనసులు ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి 12 నెలల పాటు కష్టపడి పరీక్ష రాస్తే.. ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్ల ఫెయిల్ అయితే విద్యార్థులు భరించగలరా అని మారుతి ట్విట్టర్ ద్వారా కేసీఆర్ కు సూచించారు.

    గడువు పెంచండి

    గడువు పెంచండి

    ఇక ఇంటర్ ఫలితాల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ గడువు పెంచేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలని మారుతి కోరారు. వాటి రుసుమును కూడా రద్దు చేయాలి. విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటే ఇంకా మంచిదని దర్శకుడు మారుతి సూచించారు. ప్రస్తుతం తెలంగాణాలో ఇంటర్ బోర్డు అవకతవకల విషయం రోజు రోజుకూ హాట్ టాపిక్ గా మారుతోంది. విద్యార్థులు ఇంటర్ బోర్డు శైలిపై అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు.

    చదువు వల్ల నేను డైరెక్టర్ కాలేదు.. ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు బలి.. డైరెక్టర్ మారుతి!చదువు వల్ల నేను డైరెక్టర్ కాలేదు.. ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు బలి.. డైరెక్టర్ మారుతి!

    పోరాడగలిగే ధైర్యం

    పోరాడగలిగే ధైర్యం

    హీరో రామ్, సాయిధరమ్ తేజ్, కోన వెంకట్ లాంటి సెలెబ్రిటీలంతా ఇప్పటికే విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇంటర్ ఫలితాలని సీరియస్ గా తీసుకోకూడదని రామ్ సూచించండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని చివరివరకు పోరాడగలిగే ధైర్యంతో ఉండాలని సాయిధరమ్ తేజ్ సూచించాడు.

     యావరేజ్ స్టూడెంట్

    యావరేజ్ స్టూడెంట్

    ఇక దర్శకుడు మారుతి ఇటీవల చేసిన ట్వీట్ లో తాను యావరేజ్ స్టూడెంట్ ని అని తెలిపారు. ఆ తర్వాత యానిమేషన్ టెక్నాలజీలో టాపర్ అయ్యా. అవేమీ నన్ను దర్శకుడిని చేయలేదు. సినిమా పట్ల నాకున్న అంకిత భావం వల్లే డైరెక్టర్ అయ్యానని మారుతి తెలిపారు. తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

    English summary
    Director Maruthi appeal to Telangana CM KCR over Inter Students. Telangana Inter Board became hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X