twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌పై రాద్దాంతం, క్యూలో నిలబడలేదని.. రిపోర్టర్‌కి డైరెక్టర్ మారుతి అదిరిపోయే కౌంటర్!

    |

    Recommended Video

    Director Maruthi Gives Strong Counter To Reporter On Pawan Kalyan Issue || Filmibeat Telugu

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి సారి ఎన్నికల బరిలో నిలిచారు. జనసేన పార్టీ ఏపి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. సార్వత్రక ఎన్నికల తొలిదశ పోలింగ్ లో భాగంగా ఏపిలో గురువారం రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల తాకిడి మొదలైంది. సినీ రాజకీయ ప్రముఖులు కుడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడి ఓటేయలేదంటూ ఓ మీడియా ప్రతినిధి సృష్టించిన సంచలనానికి సినీ దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు.

    క్యూలో నిలబడి ఓటేయలేదని

    క్యూలో నిలబడి ఓటేయలేదని

    సిఎం అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ క్యూలో ఉన్న జనాలని ఇబ్బందికి గురి చేసి క్యూలో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటు వేశారని ఓ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి సంచలనం సృష్టించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఓటర్లతో పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేశారు. సదరు మీడియా ప్రతినిధి తీరుని సినీ దర్శకుడు మారుతి తీవ్రంగా తప్పుబట్టాడు. పోలింగ్ కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ వచినప్పుడు నెలకొన్న వస్తవ పరిస్థితిని వివరించాడు.

     సంచలనం చేయొద్దు

    సంచలనం చేయొద్దు

    దర్శకుడు మారుతి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. మేడం ప్లీజ్.. ప్రతి విషయాన్ని సంచలనం లాగా చిత్రీకరించవద్దు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి క్యూలో నిలబడే పరిస్థితి ఉంటుందా అని మారుతి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ఉన్న చోట ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు ఉంటాయో వివరిస్తూ మీడియా ప్రతినిధులు పవన్ కోసం తోపులాటకు గురవుతున్న ఫోటోలని మారుతి పోస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడడం సరైనదేనా. అలా చేస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.

    అందుకే అలా

    అందుకే అలా

    క్యూలో నిలబడితే మరింత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి కాబట్టే ఆయన క్యూలో నిలబడకుండా ఓటు వేసి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓ యువకుడు ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధితో తెలిపాడు. పవన్ కళ్యాణ్ ని నేరుగా లోనికి అనుమతించడమే మంచిది. లేకుంటే మరిన్ని సెక్యూరిటీ సమస్యలు వస్తాయి అని ఆ యువకుడు చెబుతుండగానే సదరు మీడియా ప్రతినిధి అతడి వాయిస్ ని మధ్యలో కట్ చేసింది. అలా ఎందుకు చేశారు అని కూడా మారుతి ప్రశ్నించారు.

    త్వరలో కొత్త చిత్రం

    త్వరలో కొత్త చిత్రం

    ఇక సినిమాల విషయానికి వస్తే మారుతి త్వరలో తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి ఓ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మారుతి చివరగా తెరకెక్కించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం పర్వాలేదనిపించింది.

    English summary
    Director Maruthi gives strong counter to Reporter who trying to create sensation on Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X