»   »  అభిమానులకు ఎన్టీఆర్ ఎప్పుడూ యంగ్ టైగరే.. 'ఏ వన్ స్టార్' కాదు..

అభిమానులకు ఎన్టీఆర్ ఎప్పుడూ యంగ్ టైగరే.. 'ఏ వన్ స్టార్' కాదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కున్న బిరుదు అని మనకు తెలుసు. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని ఏ వన్ స్టార్ అనే టైటిల్‌తో పాపులర్ చేయడానికి శక్తి దర్శకుడు మెహర్ రమేష్ కృషి చేస్తున్నాడు. దీనికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే పలు ఉదాహరణలు. మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ని ఏ వన్ స్టార్ అని, శక్తి పోస్టర్స్ లో కూడా ఓ వన్ స్టార్ అని బిరుదును తగిలించి తన అభిమానులకు చేరేలా చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.

ఇది మాత్రమే కాకుండా త్వరలో ఆడియో విడుదల జరుపుకుంటున్న శక్తి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ సాంగ్‌లో ఏ వన్ స్టార్ అనే లిరిక్‌లు రాయించి మరీ పాటలను చిత్రీకరించాడని సమాచారం. తన శక్తి వంచన లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌ని ఈసినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ టాప్ పోజిషన్‌లో నిలబెట్టేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఈ ఏ వన్ స్టార్ అనే బిరుదు పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. వాళ్శు మాత్రం యంగ్ టైగర్ అని పిలుచుకోవడానికే ఇష్టపడుతన్నారంట. దీనిని బట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని మెహర్ రమేష్ ఏ వన్ స్టార్ అని పిలిపించాలనుకున్న ఆశ ఆడియసేగానే మిగిలిపోయిందని ఫిలిం నగర్ జనాభా అనుకుంటున్నారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు యంగ్‌గా ఉన్నాడు కాబట్టి యంగ్ టైగర్ అని పిలుస్తున్నారు..మరీ రేపు ముసలివాడు ఐతే ఏ బిరుదు పెట్టి పిలుస్తారోనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
The plan of Jr NTR to replace all these titles with a single 'A One Star' misfired very badly. Director Meher Ramesh made special attempts to popularize this uncatchy title through Twitter and even made lyricists to pen a special line in opening song of 'Shakti' calling Junior NTR as 'A One Star'. But Nandamuri fans have shown no interest on this unappealing heading and are still calling their favorite hero only as Young Tiger.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu