»   »  సంధాన కర్తను మాత్రమే: దర్శకుడు మురగదాస్

సంధాన కర్తను మాత్రమే: దర్శకుడు మురగదాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Director Muragadas about his latest film
హైదరాబాద్ : ''ఓసారి ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్డూడియో నన్ను సంప్రదించింది. 'మా సంస్థలో సినిమా తీయండి' అని వాళ్లు అడిగారు. కానీ దర్శకుడిగా నాకు ఖాళీ లేదు. 'దక్షిణాదిన ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. వాళ్లతో సినిమా చేద్దాం. నేను మధ్యవర్తిగా ఉంటా..' అని అడిగా. వాళ్లూ ఒప్పుకొన్నారు. ఇక్కడున్న ప్రతిభావంతులకూ, అక్కడున్న హాలీవుడ్‌ సంస్థకు నేను సంధాన కర్తను మాత్రమే అన్నారు. ఆయన నిర్మించిన రాజు రాణి చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే తొలి చిత్ర దర్శకులకు మా సంస్థ ద్వారా అవకాశం ఇవ్వాలన్నది ధ్యేయం. నిర్మాతగా చిన్న సినిమాలే చేశా. ఎందుకంటే కొత్తవాడిని కదా? . నిజానికి చిన్న సినిమాలతోనే రిస్క్‌ ఎక్కువ. అందులో స్టార్స్‌ ఉండరు. కేవలం కథను నమ్మి సినిమా తీస్తాం. రూ .5 కోట్లయినా సరే.. డబ్బు డబ్బే కదా? భవిష్యత్తులో నేను కూడా పెద్ద సినిమాలు తీస్తానేమో..?'' అన్నారు.

ఇక ''గజిని సినిమాని తెలుగులో మహేష్‌బాబుతో చేద్దామనుకొన్నా. కానీ అనువాదంతో సరిపెట్టాల్సివచ్చింది. ఈసారి ఎలాగైనా మహేష్‌తో సినిమా చేయాలనివుంది. అతని కోసం కథ కూడా సిద్ధం చేశా. రామ్‌చరణ్‌తో కూడా సినిమా చేయాలనివుంది. ఇద్దరికి సరిపడా యాక్షన్‌ కథాంశాలు నాదగ్గర ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా తక్కువ సినిమాలే చేశా. కారణం.. నేనొక్కడినే కాదు. కథ కుదరాలి. కథానాయకులు అందుబాటులో ఉండాలి. అన్నీ కుదిరితేనే కదా సినిమా సెట్స్‌పైకి వెళ్లేది. ప్రస్తుతం 'తుపాకి'ని బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో విడుదల చేస్తాం. 'తుపాకి'కి సీక్వెల్‌ చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. తరవాత ఏం జరుగుతుందో చూడాలి''. అన్నారు.

తాజా చిత్రం గురించి మాట్లాడుతూ... ''రాజా రాణి అన్నిహంగులూ ఉన్న చిత్రం. భార్యాభర్తల అనుబంధం, ప్రేమ, వినోదం అన్నీ ఉన్నాయి. తమిళంలో మంచి విజయం అందుకొంది. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ ఉన్నందుకే డబ్‌ చేశాం. నిజానికి ఈ కథను తెలుగులో రీమేక్‌ చేయొచ్చు. కానీ ఆ అనుభూతిని మళ్లీ కలిగించడం అంత తేలికైన విషయం కాదు. నయనతారకు ఇక్కడ మార్కెట్‌ ఉంది. ఆర్య అందరికీ తెలిసి నటుడు. అందుకే అనువాదంతో సరిపెట్టాం. నేను డబ్బులు సంపాదించడం కోసం నిర్మాతగా మారలేదు. ఓ మంచి సినిమాని అందించాలన్నదే నా ఉద్దేశం'' అని చెప్పుకొచ్చారు.


ప్రియురాలిని కోల్పోయిన హీరో, ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్ వీరిద్దరికి అనుకోని పరిస్థితిలో పెళ్ళి జరుగుతుంది. వారి ప్రేమలను మరచి పోలేని వారిద్దరి మధ్య దాంపత్య జీవితం ఎలా సాగింది. అనే అంశాన్ని కలర్ ఫుల్ గా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. అదే ఆర్య, నయనతార టైటిల్ రోల్స్ చేసిన 'రాజా రాణి' కాన్సెప్టు. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ నిర్మాణంలో 'గజిని', 'ఠాగూర్' వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో రాబోతోంది. ఈ నెల 14న అత్యధిక థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది.

English summary

 Raja Rani' starring Arya, Nayan Tara, Jai, Najriya, Satya Raj etc was a sleeper hit in Tamil in 2013. The film's Telugu version with a stellar ensemble cast led by Nayanthara, Arya and featuring Jai , Nazriya, Santhanam and Sathyaraj making it one of the most awaited films of the year is to be released on the 14th March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu