»   »  'జై బోలో తెలంగాణ' లో ఆ మాటలు తొలిగిస్తాం...ఎన్.శంకర్

'జై బోలో తెలంగాణ' లో ఆ మాటలు తొలిగిస్తాం...ఎన్.శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జై బోలో తెలంగాణ' చిత్రంలో సీమాంధ్రులను కించపరిచే విధంగా ఉన్న వలసవాదులు అనే సంబోధనలను తొలగించడంకాని, మార్చడం కాని చేస్తామని దర్శక నిర్మాతలు శంకర్, కోటగిరి వెంకటేశ్వరరావులు హామీ ఇచ్చారు.అలాగే 'జై బోలో తెలంగాణ' సినిమా విడుదలైన ప్రతి చోటి నుంచి సూపర్ హిట్ అన్న టాక్ వస్తున్నదని దర్శకుడు శంకర్ చెప్పారు.

ఉద్యమానికి ఈ చిత్రం మరింత ఊతమిస్తుందన్నారు.. పది పుస్తకాల సారాంశాన్ని ఈ ఒక్క సినిమాలో చూపారని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇక మొన్న శుక్రవారం విడుదలైన 'జై బోలో తెలంగాణ' నైజాం ప్రాంతంలో మంచి చిత్రంగా పేరు సంపాదించుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. కేసీఆర్ రాసిన పాటకు, గద్దర్ నృత్యానికి జనం నీరాజానాలు పడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu