Just In
- 9 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 51 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- News
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఇంగితం కూడా వారికి లేదు: ప్రభాకర్ సంచలన కామెంట్స్

దర్శకుడు ప్రభాకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మీద సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎంతో మందికి హెల్ప్ చేశాను. కానీ నాకు అవసరం ఉన్నపుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన 'బ్రాండ్ బాబు' సినిమా గురించి చాలా మందిని అడిగాను. టీజర్ ట్వీట్ చేయాలని కోరినా చాలా మంది రెస్పాండ్ కాలేదు. చాలా మంది తమ స్వార్థంగా ఆలోచించారు అని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఉన్న ఇంగితం కూడా కొంతరికి లేదని... అలాంటి సమయంలో వెన్నెల కిషోర్ లాంటి మంచి మనసున్న ఫ్రెండ్ హెల్ప్ చేశాడని తెలిపారు.

చాలా మంది స్పందించలేదు
‘బ్రాండ్ బాబు' మూవీకి ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలనుకున్నపుడు ఎవరితో చేయించాలని చాలా ఆలోచించాం. మారుతిని అడిగితే వెన్నెల కిషోర్‌కు ఈ విషయం చెప్పారు. ఆయన మేము అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఎందుకు నేను ఆయన పేరు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందంటే.. నాకు చాలా క్లోజ్‌గా ఉండే మంచి పొజిషన్లో ఉన్న చాలా మందిని అడిగాను. రిప్లై లేదు. రిప్లై ఇస్తే నో అని చెబితే రేపు నేను ఎక్కడైనా అవసరం వస్తానేమో వారికి తెలియదు. అందుకే నో చెప్పలేరు. ఎస్ అంటే వారికి తక్కువగా అనిపిస్తుందేమో... అని ప్రభాకర్ వ్యాక్యానించారు.

వెన్నెల కిషోర్ ఇండస్ట్రీ మనిషి
నేను చాలా మందిని అడిగాను రిప్లై కూడా ఎవరి దగ్గరి నుండి లేదు. ఒకరిద్దరు రిప్లై ఇచ్చిన వారు కూడా పెడతాను అని చెప్పి పెట్టలేదు. అపుడు వెన్నెల కిషోర్ ను మారుతి అడిగితే వెంటనే ఓకే చేశారు. ఆయనకున్న ఫాలయింగుకు.... మాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మా సినిమాలో కూడా లేడు. నేను రెండు సినిమాలు చేస్తే రెండింటిలో ఆయన్ను పెట్టుకోలేదు. ఎందుకు చేయాలండీ అని ఆయన అనొచ్చు. కానీ ఆయన అలా ఆలోచించలేదు. చాలా స్పోర్టివ్ తీసుకుని మా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

రాజమౌళి బాహుబలి వల్లే
ఇండస్ట్రీ బావుంటే అందరం బావుంటాం. నా సినిమా బావున్నంత మాత్రాన అందరూ బావుండరు. ఇండస్ట్రీలో ఎవరికి వారు నా సినిమా బావుంటే చాలు, నా తమ్ముడిది బావుంటే చాలు, నా బావ మరిది సినిమా బావుంటే చాలు అనుకుంటే....ప్రపంచం నలుమూలలకు తెలుగు సినిమా పాకేది కాదు. ఈ రోజు రాజమౌళి తీసిన ఒక్క సినిమా బాహుబలితో ప్రపంచంలో మన జెండా ఎగరవేశాం. జపాన్ వాళ్లు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తున్నారు. ఎక్కడికెళ్లినా మేము తెలుగు అంటే బాహుబలి కదా అని వారు గుర్తు చేస్తున్నారు. ఇలా మన ఇండస్ట్రీ బావుండాలని కోరుకోవాలి.

నా వద్ద ఆల్రెడీ వారి పరువు పోయింది
కొందరు ట్వీట్ చేయమన్నా చేయలేదు. వారి పేర్లు చెప్పాలని కూడా లేదు. వారి పేరు పలకడానికి నాకే ఇబ్బందిగా ఉంది. వారి పేరు చెప్పి ఇంకా పరువు తీయడం ఎందుకు? ఆల్రెడీ నా దగ్గర వాళ్ల పరువు పోయింది చాలు. మామా అంటూ వాటేసుకుంటారు. నేను మాత్రమే ఉన్నపుడు నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మరిచిపోను అంటారు. జనాల్లోకి వెళ్లేసరికి ఇలా ఉంటుంది.

ప్రదీప్‌కు ఉన్న ఇంగితం కూడా లేదు
కొంతమంది చేశారు. యాంకర్ ప్రదీప్ నేను ఇలా చెప్పగానే చేశాడు. చిన్నవాడు వాడికి ఉన్న ఇంగితం కూడా కొంతమందికి లేదు. మనకు హెల్ప్ చేయడం లేదని వాళ్లు బ్యాడ్ అని నేను అనడం లేదు. నా వైపు నుండైతే బ్యాడే. ఎందుకంటే నువ్వెవరో తెలియకుండా, పరిచయం లేకుండా నిన్ను అడగలేదు. అసలు నేను అడగాల్సిన అవసరం కూడా లేదు. నీ స్నేహితుడు సినిమా చేస్తున్నాడంటే నువ్వు చేయాలి. నీ పొజిషన్లో ఉంటే నేను తప్పకుండా చేస్తాను. నువ్వు చేయాలని నేను కోరుకున్నాను. నువ్వు కోరుకుంటే సరిపోతుందా? నేను అనుకోవాలి కాదా అంటే నాదే తప్పు.

మంచి వారెప్పుడూ బావుంటారు
ఇద్దరు ముగ్గురిని అడిగాను కానీ చేయలేదు. హరీష్ శంకర్ ను అడిగితే వెంటనే చేశాడు. టీజర్ రీజల్ కు కూడా వచ్చారు. చై అక్కినేని నాకు అస్సలు పరిచయం లేదు మారుతికే పరిచయం. కానీ ప్రభాకర్ దర్శకుడు అని చెప్పి ట్రైలర్ లాంచ్ చేశారు. వారంతా గొప్పవారు. అలాంటి వారు ఎప్పుడూ బావుంటారు. ట్వీట్ చేయని వారు పాడైపోతారని అని అనడం లేదు. మంచి వారెప్పుడూ బావుంటారు.... అని ప్రభాకర్ తన మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు.