NTR 31: హాట్ టాపిక్‌గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్.. ఆ రేంజ్‌లో కేజీఎఫ్ డైరెక్టర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హై వోల్టేజ్ పాన్ ఇండియా ప్రాజెక్టులు సెట్టవుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో బాహుబలి లాంటి కలెక్షన్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ మరో స్థాయికి వెళుతుందని చెప్పవచ్చు. ఇక ఈ బిగ్ ప్రాజెక్టులలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎంత తీసుకుంటున్నాడు అనే విషయంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

Recommended Video

Tollywood హీరో పై Prashant Neel ఫోకస్ | NTR 31 | Salaar | KGF Chapter 2 || Filmibeat Telugu
మొదటిసారి ఇండియన్ బాక్సాఫీస్ ముందు..

మొదటిసారి ఇండియన్ బాక్సాఫీస్ ముందు..

దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కన్నడ సినిమాను మొదటిసారి ఇండియన్ బాక్సాఫీస్ ముందు పోటీగా దించాడు. కన్నడ సినిమాలు కూడా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వగలవా అనే ఊహలకు చెక్ పెట్టి తన రేంజ్ ను అమాంతంగా పెంచుకున్నాడు.

KGF 2 కోసం కూడా..

KGF 2 కోసం కూడా..

భవిష్యత్తు తరాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసే రోజు రావాలని రాజమౌళి చాలా సార్లు చెప్పాడు. ఆ మాట నిజమయ్యేలా ఉన్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. ఎందుకంటే KGF 2 కోసం కూడా అభిమానులు ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్

ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్

ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీపై కూడా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా వచ్చే ఎడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను రెండు విభిన్నమైన పాత్రలలో చూపించనున్నట్లు టాక్ వస్తోంది.

ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్

ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్

సలార్ అనంతరం అంతకుమించి అనేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఆ సినిమాకు దర్శకుడు మిగతా పాన్ ఇండియా దర్శకులతో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. రాజమౌళి, సుకుమార్ కంటే తక్కువగా 10కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. అందుకు కారణం లేకపోలేదు.

20కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ..

20కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ..

ప్రశాంత్ నీల్ KGF అనంతరం రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించకుండా వెంటవెంటనే సినిమాలను లైన్ లో పెట్టాడు. ఎన్టీఆర్ సినిమాకు 20కోట్లు తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ అతను ఎక్కువగా ఆశ పడలేదు. నిజానికి KGF 2, సలార్ సినిమాల విడుదల అనంతరం ఎన్టీఆర్ 31 డీల్ సెట్టయ్యి ఉండుంటే మైత్రి మూవీ మేకర్స్ కచ్చితంగా ఎక్కువ ఇచ్చి ఉండేది. మరి ఈ సినిమాల అనంతరం అతను ఎంత డిమాండ్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X