For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంతవరకు పడని కష్టాలన్నీ పడ్డాను,వంగితే నిల్చోలేని పరిస్థితి: హీరో రాజశేఖర్‌

  |
  Rajashekar revealed His Next Film With Balakrishna @Garuda Vega Trailer Launch | Filmibeat

  యాంగ్రీ యంగ్ మేన్ ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ పేరుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది బాలీవుడ్ లో తన కెరీర్ కొత్తల్లో ఇలా పిలిపించుకున్నది లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత తెలుగు లో హీరో రాజశేఖర్ కి మాత్రమే ఈ ట్యాగ్ లైన్ వచ్చింది. అంకుశం, మగాడు లాంటి సినిమాల్లో రాజశేఖర్ నటన అప్పట్లో సీరియస్ పోలీస్ ఆఫీసర్ అనే పాత్రకి ఒక మార్క్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా వయసు మీద పడటం, కొత్త హీరోల రాక, సరైన పాత్రలు రాకపోవటం వంటి అనేక కారణాలతో కొంత వెనకబడ్డాడు ఈ సీనియర్ హీరో.

   పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం

  పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం

  "ఎవడైతే నాకేంటీ" అనే సినిమా కి ముందూ కొన్నీ, ఆ సినిమాతర్వాత వచ్చినవి అన్నీ పెద్ద చెప్పుకోదగ్గ హిట్ ఏమీ ఇవ్వలేదు. అయితే ఇన్నాళ్లకి మళ్ళీ ఒకసారి పోలీస్ ఆఫీసర్ గా తన విశ్వరూపాన్ని చూపించాడట రాజశేఖర్. గుంటూర్ టాకీస్ ఫేం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం సినిమాలో నటించాడు.

  ఆ మాత్రం బడ్జెట్ సరైందే

  ఆ మాత్రం బడ్జెట్ సరైందే

  ఈ సినిమాను దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం టాలీవుడ్ ను ఆశ్చర్యపరిచింది. అయితే ట్రైలర్ చూసాక మాత్రం ఆ మాత్రం బడ్జెట్ సరైందే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. కథని తాను ఏ రేంజి లో తెరకెక్కించాడో ప్రవీణ్ మేకింగ్ చూస్తే తెలిసిపోతోంది. ట్రైలర్ చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తోంది.

  ఇదంతా తెరపై చూపించగలరా

  ఇదంతా తెరపై చూపించగలరా

  నిన్న ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా సినిమా కోసం ఏ రేంజిలో కష్టపడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు రాజశేఖర్. "ప్రవీణ్ సత్తారు వచ్చి ఈ సినిమా స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఇదంతా తెరపై చూపించగలరా? అనే డౌట్ వచ్చింది. అదే మాట ఆయనను అడిగితే పేపర్ పై రాసినదంతా తెరపై చూపిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

  ఇంతవరకు పడని కష్టాలన్నీ పడ్డాను

  ఇంతవరకు పడని కష్టాలన్నీ పడ్డాను

  దాంతో నేను కూడా గొప్పగా చెప్పాలన్న ఉద్దేశంతో వందేమాతరం - ప్రతిఘటన - ఆహుతి - అంకుశం సినిమాల్లో ఎలా పరిగెత్తానో.. ఎలా పల్టీలు కొట్టానో ఇప్పుడు చేయగలనని అనేశాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంతవరకు పడని కష్టాలన్నీ పడ్డాను. ఇప్పుడు కిందకి వంగితే నిల్చోలేని పరిస్థితి. అంత బెండు తీశాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్ని పాట్లు పడ్డానో మీరే చెబుతారు" అంటూ తను పడ్డ కష్టాలు చెప్పుకొచ్చాడు హీరో రాజశేఖర్.

  బాగానే వాడాడట

  బాగానే వాడాడట

  మొత్తానికి ఈ ఏజ్ లో కూడా మనోన్ని బాగానే వాడాడన్న మాట డైరెక్టర్. నిజానికి ఇప్పటి మార్కెట్ ని బట్టి చూస్తే రాజశేఖర్ స్టామినా పది కోట్లు దాటదు. కానీ తన మేకింగ్ స్టైల్, కథ, స్క్రిప్ట్ ల మీద నమ్మకం తోనే అంత బడ్జెట్ లో ఈ సినిమా తీసాడట ప్రవీణ్ సత్తారు. ఇక రాజశేఖర్, నటన, సన్నీ లియోన్ అనే ప్రత్యేక ఆకర్శణా ఈ సినిమాకి ప్లస్ అనుకోవచ్చు.

  ఈ హిట్ అత్యంత కీలకం

  ఈ హిట్ అత్యంత కీలకం

  సో..! ఇక వీటికి తగ్గట్టు కథ కూడా జనాలకి నచ్చితే రాజశేఖర్ ఖాతాలో ఇంకో మంచి హిట్ పడ్డట్టే, అంతే కాదు ప్రవీణ్ కి కూడా ఇప్పుడు ఈ హిట్ అత్యంత కీలకం. అందుకే చాలా జాగ్రత్తగా, ఓపికగా తనకు కావాల్సిన వర్క్ రాబట్టుకున్నాడట. చూడాలి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందో...

  English summary
  Raja Sekhar who is now promoting his movie said how hard it was for them to release the theatrical trailer of the movie. " i struggled a lot to complete the movie and now i couldn't even stand if i bent down. After the movie release you will understand what i meant." Shared Rajasekhar about his journey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X