»   » ఫేస్ బుక్ స్టేటస్ ని కాపీ కొట్టిన పూరీ జగన్నాథ్‌, ఇలా చేసాడేంటి?

ఫేస్ బుక్ స్టేటస్ ని కాపీ కొట్టిన పూరీ జగన్నాథ్‌, ఇలా చేసాడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా సినిమావాళ్లు ప్రక్క సినిమాలు చూసి కాపీ కొడతారు, సీన్స్ లేపుతారు అంటూంటాం. అయితే తన పదునైన డైలాగ్స్ తో సమాజాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తూ పోకిరి, ఇడియిట్, బిజినెస్ మ్యాన్ చిత్రాలలో పవర్ ఫుల్ డైలాగులు రాసి తన మాటలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ..ఫేస్ బుక్ పోస్ట్ ని సైతం కాపీ కొట్టాడంటే నమ్మబుద్ది కాదు..కానీ సాక్ష్యాలు ఎదురుగా కనపడుతూంటే నమ్మకండా ఉండలేం కదా. అదేంటే మీరు క్రింద మీరు చూడండి.

ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేయడంతో చిల్లర కోసం సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. రోజుల తరబడి ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన అభిప్రాయాన్ని ఇలా వివరించారు.

''రెండువేల నోటుకి చిల్లర మార్చగలిగితే వాడిని వీరుడు అంటారు. అదే రెండువేల నోటుకి చిల్లర ఇచ్చేవాడిని దేవుడు అంటారు'' అంటూ పూరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. అంతవరకూ బాగానే ఉంది.

అయితే ఇదే పోస్ట్ ని ఇదే పోస్ట్ ని ఎన్ ఎమ్ ఆర్ మహేష్ అనే అతను పెట్టడంతో సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ విషయం తెలియచేస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు చూడండి.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన తదుపరి హీరో కోసం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. కళ్యాణ్ రామ్ తో ఆయన రీసెంట్ గా చేసిన ఇజం చిత్రం ఊహించని విధంగా ఫెయిల్యూర్ కావటం నిరాశకలిగించింది. ఆయన ఎన్టీఆర్, మహేష్ ల కోసం కథలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి డేట్స్ దొరికేలోగా..ఓ చిన్న హీరోతో సినిమా పూర్తి చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

English summary
Puri Jagannadh’s movies are popular for the unique dialogues. His powerful punch dialogues from the movies Pokiri, Idiot and ISM, have created lot of sensation among the movie lovers. But now he copied a Facebook post.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu