»   » కథలు వినడానికా? డ్రగ్స్ కోసమా.. ఛార్మీ, రవితేజ మాటేమిటి? విచారణ ఒత్తిడిలో పూరీ

కథలు వినడానికా? డ్రగ్స్ కోసమా.. ఛార్మీ, రవితేజ మాటేమిటి? విచారణ ఒత్తిడిలో పూరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ బుధవారం ఉదయమే ఎక్సైజ్ శాఖ చేరుకొన్నారు. దాదాపు మూడుగంటలపాటు అధికారులు పలురకాల ప్రశ్నలతో పూరీ జగన్నాథ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ఓ దశలో అసహనానికి, తీవ్ర ఒత్తిడికి గురైనట్టు పోలీసుల వర్గాలు సమాచారం. సుదీర్ఘంగా సాగిన విచారణలో స్వల్ప విరామం కూడా ఇచ్చినట్టు తెలుస్తున్నది. లంచ్ సమయానికి విచారణను నిలిపివేసి పూరీకి భోజన విరామం కల్పించనట్టు మీడియా కథనాలు వెల్లడయ్యాయి.

20 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

20 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

పూరీ జగన్నాథ్ విచారణ కోసం దాదాపు భారీగానే ప్రశ్నావళిని రూపొందించారని తెలుస్తున్నది. భోజన విరామ సమయానికి దాదాపు 20 ప్రశ్నలను అధికారులు సంధించినట్టు సమాచారం. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేంతవరకు పూరిని వదిలిపెట్టలేదనేది ఇన్‌సైడ్ టాక్. విచారణ సందర్భంగా మానసిక నిపుణుడిని దర్యాప్తు బృందంలో చేర్చడం గమనార్హం. అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు పూరీ బాడీ లాంగ్వేజ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు..

బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు..

పూరీ జగన్నాథ్‌ను ప్రధానంగా బ్యాంకాక్ పర్యటనల గురించి ఆరా తీసినట్టు తెలుస్తున్నది. కథలు వినడానికా? కథలు తయారు చేసుకోవడానికి బ్యాంకాక్ వెళ్తారా లేక డ్రగ్స్ కోసమే అక్కడి వెళ్తారా అనే ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం. భోజన విరామం అనంతరం మళ్లీ విచారణను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.

డ్రగ సప్లయర్ కెల్విన్‌‌తో ఎలాంటి సంబంధాలున్నాయి

డ్రగ సప్లయర్ కెల్విన్‌‌తో ఎలాంటి సంబంధాలున్నాయి

ఈ కేసులో డ్రగ్ సప్లయర్ కెల్విన్ అరెస్ట్ ద్వారానే ఈ కేసు గుట్టు రట్టయింది. ఆయన ఫోన్ కాల్ ఆధారంగానే పలువురు సినీ ప్రముఖుల జాతకాలు బట్టబయలు అయ్యాయి. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులకు కెల్విన్‌తో జరిగి పరిచయం, ఆయన ఎవరు పరిచయం చేశారనే ప్రశ్నలను ఈ కేసులో గుప్పించే అవకాశం ఉంది.

పార్టీలు ఎక్కడ చేసుకొంటారు

పార్టీలు ఎక్కడ చేసుకొంటారు

సాధారణంగా స్నేహితులందరూ కలిసి మందు పార్టీలు బయటనే చేసుకొంటారు. కానీ డ్రగ్ కేసులో చాలా వరకు పార్టీలు ఎక్కువగా కొందరి ఇంట్లోనే జరిగాయనేది అధికారులు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఫలానా వాళ్ల ఇంట్లోనే ఎందుకు చేసుకొంటారు అనే కోణంలో ప్రశ్నలు వేసినట్టు సమాచారం.

ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజకు సంబంధముందా?

ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజకు సంబంధముందా?

డ్రగ్స్ వ్యవహారంలో పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. పూరీ అండ్ కంపెనీ సభ్యుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, సుబ్బరాజు, తదితరలకు మీ నుంచే డ్రగ్స్‌, కొకైన్‌ వెళ్లింది నిజమా, కాదా? అనే పశ్నను అధికారులు అడిగినట్టు
సమాచారం.

ఎన్ని రోజులకోసారి డ్రగ్స్ తీసుకొంటారు..

ఎన్ని రోజులకోసారి డ్రగ్స్ తీసుకొంటారు..

డ్రగ్స్ వాడకం ఎప్పుడు ఉంటుంది. ఎన్ని రోజులకోసారి తీసుకొంటారు. వాటిని ఎలా రవాణా చేస్తారు. తమ వద్ద ఉంటే ఎక్కడ భద్రపరుస్తారు. కెల్విన్ ఎలా వాటిని సరఫరా చేస్తాడు అనే కోణంలో సినీ ప్రముఖులను వివిధ రకాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగి నిందితులను తికమకకు గురిచేసే అవకాశం ఉంది.

సిట్ అధికారుల ముందుకు పూరీ.. సినీ ఫక్కీలో సంధించే తికమక ప్రశ్నలివేనట..

English summary
Director Puri Jagannath attended for Excise department probe in Drug Case. He was quized by officials with 20 Questions. One psychriatist joined the official for this intergation. Puri Jagannath was given Lunch break for a while.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu