For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SSMB29: మహేశ్ బాబుతో సినిమాపై రాజమౌళి కొత్త హింట్.. కీలక విషయాలు చెప్పిన వీడియో వైరల్

  |

  సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. జక్కన్న, టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కలయికలో సినిమా రావాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో SSMB29గా సినిమా రానున్నట్లు ప్రకటించినప్పటి నుంచి మూవీపై క్యూరియాసిటీ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఏ జోనర్ లో తెరకెక్కించనున్నారని పలు రకాలుగా టాక్ నడిచింది. అయితే ఈ విషయాలపై ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తాజాగా ఓ వీడియోలో ఆయన పలు కీలక విషయాలు చెప్పారు.

  ఎప్పుడెప్పుడు వస్తుందా అని..

  ఎప్పుడెప్పుడు వస్తుందా అని..

  దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక వీరి కలయికలో మొట్టమొదటి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

   పవర్ ఫుల్ స్టోరీతో..

  పవర్ ఫుల్ స్టోరీతో..

  అయితే రాజమౌళి మహేశ్ బాబు సినిమా కోసం దీర్ఘంగానే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు కథ అనుకున్న జక్కన్న ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నాడు. రాజమౌళి ఒక కథ రాసుకున్నాడు అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే దాన్ని సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేశ్ 29వ సినిమా కోసం పవర్ఫుల్ కథను అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

  అడవుల బ్యాక్ డ్రాప్ కథగా..

  అడవుల బ్యాక్ డ్రాప్ కథగా..


  ఇంతకు ముందు రచయిత, రాజమౌళి తండ్రి కె. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. ఇక రాజమౌళి ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు ఇదివరకే మరొక క్లారిటీ వచ్చింది. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని అర్థమవుతోంది.

  సరికొత్త యాక్షన్ అడ్వెంచర్..

  సరికొత్త యాక్షన్ అడ్వెంచర్..

  తాజాగా మహేశ్ బాబుతో సినిమాకు సంబంధించిన విషయాలను స్వయంగా రాజమౌళినే వివరించారు. ప్రస్తుతం RRR సినిమాకు సంబంధించి అమెరికాలో ప్రచారం చేస్తున్న జక్కన్న.. తర్వాతి సినిమా అయిన SSMB29 ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తర్వాతి సినిమా కథ ఏంటని అడగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు కనిపించని సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.

  చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా..

  చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా..

  "ఇప్పుడే నా నెక్ట్స్ సినిమా గురించి చెప్పడం కొంచెం కష్టం. సాధారణంగా నా సినిమాలన్నింటికి మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. నా తర్వాతి సినిమాకు సంబంధించిన స్టోరి గురించి మా టీమ్ అంతా చర్చిస్తారు. 2 నెలల క్రితమే నా తర్వాతి ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. ఈ సినిమా నాకు బాగా నచ్చిన హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉండాలని భావిస్తున్నాను. నేను చాలా కాలంగా ఒక అడ్వెంచర్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు స్వతహాగానే అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. అలాంటి స్టోరితోనే ఈ చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను" అని రాజమౌళి హింట్ ఇచ్చారు.

  విలన్ కోసం వేట..

  అలాగే మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాలో అనేక మంది హాలీవుడ్ స్టార్స్ నటించనున్నారని టాక్ అయితే వినిపించింది. విలన్ కోసం అవేంజర్స్ విలన్ ను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత కోలీవుడ్ స్టార్ కార్తీని కూడా పవర్ ఫుల్ విలన్ కోసం తీసుకుంటారని, అందుకోసం ఆయన బాడీలో మార్పులు కూడా చేస్తారని టాక్ వచ్చింది. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందనదే భవిష్యత్తులో తేలనుంది.

  English summary
  Director Rajamouli Superstar Mahesh Babu Combo Movies SSMB29 New Update By Rajamouli And Video Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X