»   » వింత వ్యాధి సోకింది.. ఐసీయూలో చేరాను.. రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్

వింత వ్యాధి సోకింది.. ఐసీయూలో చేరాను.. రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సాధిస్తున్న కలెక్షన్లతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు కొందరు అసూయతో రగలిపోతుండగా, మరికొందరు హర్షం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అలా అసూయతో రగిలిపోతున్న వారిలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకరు. ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పదమైన ట్వీట్లు చేసే వర్మ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మతలబు ఏమిటంటే..

వింత వ్యాధితో బాధపడుతున్నా..

ప్రస్తుతం నేను బాహుబలి2 జెలసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధికి గురైన చాలా మంది సినీ దర్శకులు, నిర్మాతలు ఇప్పటికే ఐసీయూలో చేరారు అని వర్మ ట్వీట్ చేశారు.

బాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం..

బాలీవుడ్‌పై బాహుబలి2 ప్రభావం చాలా ఉంది. ప్రతి సూపర్‌స్టార్, స్టార్ డైరెక్టర్ తదుపరి సినిమా బాహుబలి2ని మించిన బ్లాక్ బస్టర్ కావాలని కలలుగంటున్నాడు. బాహుబలి ఇప్పుడు వారికి మైలురాయిగా మారింది అని మరో ట్వీట్ చేశారు.

బాహుబలి2 మరో అవతార్..

బాహుబలి2 సినిమా ప్రస్తుతం ఇండియా అవతార్ అని వర్మ కీర్తించాడు. అవతార్‌పై జేమ్స్ కామెరాన్‌ ఖర్చు పెట్టిన మొత్తం, సమయాన్ని వెచ్చించి బాహుబలి2 తీశాడు అని వర్మ మరో ట్వీట్ చేశాడు.

నచ్చకపోతే మానసిక వ్యాధికి..

ఎవరికైనా బాహుబలి2 నచ్చకపోతే అంతకంటే విషాదం ఏమీ ఉండదు. అందుకు కారణం అతడు ఏమైనా మానసిక వ్యాధితో బాధపడి ఉండి ఉంటాడు. అలాంటి వారిని ఏ వైద్యుడికైనా, లేదా చారిటీకి తీసుకెళ్లి చికిత్స చేయించాలని నిర్మాత శోభూను కోరుతున్నాను అని వర్మ ఇంకో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

తుఫాన్‌కు అగ్నిపర్వతానికి పుట్టిన..

బాహుబలి2 అమెరికాలో తుఫాన్ సృష్టిస్తున్నది అని నిర్మాత శోభూ చేసిన ట్వీట్‌పై వర్మ స్పందించాడు. అలా ట్వీట్ చేసి అవమానపరుచవద్దు అని సూచించాడు. బాహుబలి2 సృష్టిస్తున్నది తుఫాన్ కాదు. ఓ తుఫాను, అగ్నిపర్వతంతో రతి జరుపుతూ భూప్రకంపనాల వంటి పిలల్ని సృష్టిస్తున్నది అని వర్మ ట్వీట్ చేశారు.

చాలా రోజుల తర్వాత..

ఇటీవల కాలంలో థియేటర్ల ముందు నిలబడి టికెట్లు కొనుక్కోవడం చూడటం చాలా రోజులైంది. మళ్లీ అలాంటి పరిస్థితి బాహుబలి2తోనే సాధ్యమైంది అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు.

English summary
Director Ram Gopal varma tweeted that, I just got admitted in hospital infected with Bb2Jealousitis and am glad to see all film makers are already admitted and many in ICU.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu