»   » బాహుబలిపై వర్మ షాకింగ్ కామెంట్స్.. అసూయతో రగిలిపోతున్నా.. అది డైనోసార్!

బాహుబలిపై వర్మ షాకింగ్ కామెంట్స్.. అసూయతో రగిలిపోతున్నా.. అది డైనోసార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విరుచుకుపడ్డారు. తెలుగు సినిమా ప్రముఖులను టార్గెట్ చేస్తూ తన ట్విట్టర్ హస్తాన్ని సంధించాడు. ఎప్పటిలానే ట్విట్టర్‌లో ఆసక్తికరమైన ట్వీట్లతో దుమారం రేపాడు. రాంగోపాల్ వర్మ చేసిన తాజా ట్వీట్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

అసూయతో రగిలిపోతున్నాను..

‘బాహుబలి సినిమాకు వస్తున్న ఆదరణ, క్రేజ్‌ను తట్టుకోలేక అసూయతో రగిలిపోతున్నాను. ఆ అసూయ ఓ భారీ పర్వతంలా పెరుగుతున్నది' అని వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కేవలం వర్మ చేసినప్పటికీ.. పరిశ్రమలో చాలా మంది ఇదే విధంగా రగిలిపోతున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ను చూసి..

ఇది వాస్తవమో కాదో.. నేను వినలేదు కూడా.. కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌ను చూసి ఇతర హీరోల ఫ్యాన్స్ అసూయతో చచ్చిపోతున్నారు అని వర్మ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కొంత ఆసక్తిని, కొంత అతిశయోక్తిని రేకెత్తిస్తున్నది.

బాహుబలి2 ఓ డైనోసార్

ఐరావతం లాంటి సినిమా విడుదలైనప్పుడు ఇతర సినిమాలు కుక్కల్లా మొరుగుతుంటాయి. కానీ బాహుబలి2 ఓ డైనోసార్ లాంటింది. దాని భయానికి కుక్కలు, పులులు, సింహాలు అనేటివి బయటకు రాకుండా ఎక్కడో దాక్కొన్నాయి అని మరో ట్వీట్ చేశాడు.

చెవిలో దూది పెట్టుకొని..

నేను ఇప్పుడే విన్నాను. హిందీ, తమిళ, తెలుగు సినిమా ప్రముఖులు, దర్శకులు బాహుబలి2 ప్రభంజనాన్ని తట్టుకోలేక చెవిలో దూది పెట్టుకొని పారిపోతున్నారు అనేది నా దృష్టికి వచ్చింది అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అన్ని మల్టీప్లెక్సులన్నీ సింగిల్ థియేటర్..

బాహుబలి2 చిత్రం అన్ని మల్టీప్లెక్సులను ఒక సింగిల్ థియేటర్‌గా మార్చింది. ఇండియాలోని అన్ని మల్టీప్లెక్సుల్లోని అన్ని స్క్రీన్లలో బాహుబలి2 మాత్రమే ఆడుతున్నది అని మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

English summary
Director Ram Gopal Varma made shocking comments targeting Film personalities in the time of Baahubali2 release. He tweeted that Only thing bigger than #Baahubali2 is its mountainous jealousy building ..All film people unable to digest it's hype gone into hibernation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu