»   » రవితేజ ఏం చేసినా చిరిగి చేటంతై పేటంతవుతుంది

రవితేజ ఏం చేసినా చిరిగి చేటంతై పేటంతవుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ ఏం చేసినా చిరిగి చేటంతై పేటంతవుతుంది. ఎవరేమనుకొన్నా లెక్క చేయడు. మహా మొండి. ఇతని తెగింపు చూసే కబడ్డీ చిట్టి మనసు పారేసుకొంది. మరి హీరో మనసిచ్చాడా లేదా అసలేం జరిగింది అన్నది తెర మీదే చూడాలి. అలాగే చిత్రం టైటిల్ వీర కు తగ్గట్టే హీరో పాత్రలో వీరత్వాన్ని చూపిస్తున్నాం. ఆ పాత్రలో రవితేజ నటన అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. కాజల్‌, తాప్సిలతో వచ్చే ప్రేమ సన్నివేశాలు యువతని అలరిస్తాయి అంటున్నారు రమేష్‌వర్మ. ఆయన తాజా చిత్రం లో రవి తేజ పాత్ర గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ఇక 'వీర' లో కాజల్ కబడ్డి చిట్టి అనే మాస్ పాత్రలో కనిపించనుంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తన్న తాప్సీ ఐటీ స్టూడెంట్ గా అలరిస్తుంది. కిక్ శ్యామ్ పోలీస్ ఆపీసర్ గానూ, అతని భార్యగా శ్రేదేవి చేస్తున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని గణేష్‌ ఇందుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే అరకులో ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: తమన్‌.

English summary
Veera is going to be mass-oriented film with all commercial elements. Ravi Teja is playing the character which will have two variations. Kajal is playing in a mass character called Kabaddi Chitti while Tapsi Pannnu portraying the role of an IT Student.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu