»   »  రాజమౌళి 'ఈగ'లాగే పందిపిల్ల హీరోగా, డైరక్టర్ రవిబాబు

రాజమౌళి 'ఈగ'లాగే పందిపిల్ల హీరోగా, డైరక్టర్ రవిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అవును..నిజమే...రవిబాబు ఇప్పుడో పంది పిల్లను ప్రధాన పాత్రగా తీసుకుని ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అల్లరి,అనసూయ, నచ్చావులే, అవును అంటూ విభిన్నమైన చిత్రాలు చేస్తూ వచ్చిన ఆయనకు దర్శకుడుగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రవిబాబు ... 'అదుగో' అనే టైటిల్ తో ఓ చిత్రం గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేసేసారు.

Director Ravi Babu's next with a Baby pig

రాజమౌళి 'ఈగ'తో సినిమా చేసినట్లే రవిబాబు...పందిపిల్లతో సినిమా అన్నమాట. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌, మిగిలిన పాత్రలూ ఉంటాయి. కానీ కథకు ఆధారం, ప్రాణం మాత్రం పందిపిల్లేనట. పంది పిల్లతో నవ్విస్తాడట. ఎమోషన్స్ పండిస్తాడట.

రవిబాబు మాట్లాడుతూ.... ''ఏడాదిన్నర క్రితం ఈ చిలిపి ఆలోచన వచ్చింది. ఇది వరకు కుక్క, పిల్లి, గుర్రం, కోతి లాంటి జంతువులతో సినిమా తీశారు. కానీ పందిపిల్లతో ఎవ్వరూ తీయలేదు. హాలీవుడ్‌లో మాత్రం ఓ సినిమా వచ్చిందట. 'జురాసిక్‌ పార్క్‌' లాంటి సినిమాలు యానిమేట్రానిక్స్‌ అనే టెక్నాలజీతో తీస్తారు.

దాన్ని కొనాలంటే ఓ పెద్ద హీరో రెమ్యునరేషన్‌ అంత ఉంది. అందుకే ఆ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయించాం. ఏడు నెలల పాటు దానికే సమయం పట్టేసింది. టెస్ట్‌ షూట్‌ చేసినప్పుడు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో మరో రెండు నెలలు సమయం వెచ్చించి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాం.

Director Ravi Babu's next with a Baby pig

కొంత యానిమేట్రానిక్స్‌, కొంత యానిమేషన్‌, కొంత లైవ్‌ యాక్షన్‌... ఇలా సినిమాని ప్లాన్‌ చేసుకొన్నాం. ఇలాంటి సినిమాల్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో తప్ప మరెక్కడా తీయలేం. ఫిల్మ్‌సిటీలోనే మూడు నెలల పాటు షూటింగ్‌ జరిపాం.

అభిషేక్‌, నాబ హీరో,హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరూ కొత్తవాళ్లే. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమానే. హాలీవుడ్‌లో డిస్నీ సంస్థ ఇలాంటి సినిమాల్ని తీస్తుంటుంది. వాళ్ల సినిమాలు చూస్తే అన్ని వర్గాల వాళ్లకు సంబంధించిన ఏదో ఓ అంశం సినిమాలో కనిపిస్తుంటుంది. 'అదుగో' కూడా అలాంటి సినిమానే.

షూటింగ్ కోసం చాలా కష్టపడ్డాం. పందులపై రీసెర్చ్‌ కూడా చేశాను. ఓ పందిపిల్లను కొన్నాళ్ల పాటు పెంచుకొన్నా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''అన్నారు.

English summary
Ravi Babu latest film is unique too…it’s about a piglet. “Yes, the piglet is the hero of my new film. Shooting is over and it’s now in post-production,” says Ravi Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu