ఆశపడొద్దు..అలాంటిదేమీ లేదంటూ డైరక్టర్ ఖండించేసాడు

By Srikanya

హైదరాబాద్ : దగ్గుపాటి వెంకటేష్, రానా కంబినేషన్ లో మనం తరహాలో ఓ మల్టిస్టారర్ రాబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని క్షణం దర్శకుడు రవికాంత్ పేరేపు డైరక్ట్ చేస్తున్నారని సైతం నిన్నంతా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఖండించారు రవికాంత్.

రవికాంత్ మాట్లాడుతూ.. "నేను దగ్గుపాటి హీరోలకు ఏ స్క్రిప్టునూ నేరేట్ చెయ్యలేదు. నేను ప్రస్తుతం రాస్తున్న స్క్రిప్టుని ఫినిష్ చేసే పనిలో ఉన్నాను...త్వరలోనే నా తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ వస్తుంది ", అన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రానా కు ఈ దర్శకుడు ఓ కథని నేరేట్ చేసాడని, అయితే ఆ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదాని తెలియాలి. అయితే అది మల్టిస్టారర్ కథ మాత్రం కాదని వినికిడి.

ఇక ప్రస్తుతం రానా..బాహుబలి 2 బిజీలో ఉన్నారు. దాంతో పాటు రానా హీరోగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

Director Ravikanth Perepu denies doing with Daggupati movie

భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు.

ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట.ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను .. సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం.

1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి "పి.ఎన్.ఎస్. ఘాజీ" ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఘాజీ". ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ''ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X