For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీటిమార్ సినిమా రామ్ చరణ్‌కు అందుకే చెప్పలేదు.. మరో హీరోకు కూడా చెప్పా: డైరెక్టర్ సంపత్ నంది

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అందుకున్న వారిలో సంపత్ నంది ఒకరు. ఇక ఆయన డైరెక్ట్ చేసిన 5వ సినిమా సీటిమార్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా పై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా విజయంపై దర్శకుడు చాలా నమ్మకంతో ఉన్నాడు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రస్తుతం మంచి ప్రమోషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు.

  ఇక ఈ సినిమా కథను గోపీచంద్ కంటే ముందే మరికొంత మందికి హీరోలకు కూడా చెప్పినట్లు అనేక రకాల కథనాలు అయితే వినబడుతున్నాయి. కథ నచ్చగానే మిగతా హీరోలు ఓకే చెప్పలేదని టాక్ అయితే వచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఒక యువ హీరోకి ఈ కథ చెప్పడం జరిగిందని అలాగే రామ్ చరణ్ కు కూడా చెప్పాలనే చర్చలు వచ్చాయని అని అన్నారు. ఇక వారితో చేయకుండా గోపీచంద్ చేయడానికి గల కారణాలు కూడా చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు.

  మొదటి సినిమాతోనే..

  మొదటి సినిమాతోనే..

  డైరెక్టర్ సంపత్ నంది పోసాని కృష్ణమురళి దగ్గర మూడేళ్లు సహాయ దర్శకుడిగా సహాయక రైటర్ గా కూడా వర్క్ చేశాడు. ఇక 2010లో ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. మొదటి సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాదించడంతో కావడంతో ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా రచ్చ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ తో చేసిన బెంగాల్ టైగర్ సినిమా పర్వాలేదు అనిపించింది.

   గౌతమ్ నందా విషయంలో..

  గౌతమ్ నందా విషయంలో..

  ఇక గోపీచంద్ తో సంపత్ నంది ఇదివరకే గౌతమ్ నంద అనే సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోయినా కూడా దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాలో గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఆ విషయంలో చాలా నిరుత్సాహం చెందినట్లు హీరో దర్శకుడు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు కానీ చాలామంది మాత్రం ఆ సినిమాను ఎక్కువగా లైక్ చేస్తారని అన్నారు.

  రామ్ చరణ్ కు ఎందుకు చెప్పలేదంటే?

  రామ్ చరణ్ కు ఎందుకు చెప్పలేదంటే?

  ఇక ఇప్పుడు సీటిమార్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని కూడా అన్నారు. అయితే ఈ సినిమా కథను రామ్ చరణ్ కు చెబితే బాగుంటుంది అని చాలామంది నాతో చెప్పినట్లు వివరణ ఇచ్చారు.

  అయితే నేను మాత్రం రామ్ చరణ్ ఒక కోచ్ తరహా పాత్రలో ఊహించుకో లేదని అందుకే ఈ కథను నమ్మకంగా చెప్పాలని అనుకోలేదని అన్నారు. ఒక కథను హీరోకు తగ్గట్టుగా మనం న్యాయం చేయగలమని మనకు అనిపించిన తర్వాతనే ఆ కథను వారికి చెప్పాలని నేను ఫిక్స్ అవుతాను.. అని సంపత్ నంది అన్నాడు.

  ఒక హీరోకు సీటిమార్ కథను చెప్పినప్పుడు..

  ఒక హీరోకు సీటిమార్ కథను చెప్పినప్పుడు..

  అలాగే గోపిచంద్ కంటే ముందు ఒక హీరోకు సీటిమార్ కథను చెప్పినట్లు అన్నారు. హీరో పేరు పేరు చెప్పకుండా ఎనర్జిటిక్ హీరోకు సిటీ మార్ కథ చెప్పినప్పుడు అతను తన వయసుకు సెట్టవ్వదని అన్నాడని అన్నారు. నాకు కూడా ముందు అలాగే అనిపించింది కానీ అయినా కూడా ఏదో ఆలోచించి వెళ్లాను. ఆ నిర్ణయం కరెక్ట్ కాదని హీరో కూడా నాకు చెప్పడంతో మళ్లీ వెంటనే గోపీచంద్ కు చెప్పడం జరిగింది అని వివరణ ఇచ్చాడు ఇక ఆ తర్వాత ఈ సినిమా చాలా బాగా వచ్చింది అంటూ ఈసారి మా కాంబినేషన్లో ఒక పెద్ద హిట్ చూడబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశాడు.

  ఆ హీరో ఎవరంటే?

  ఆ హీరో ఎవరంటే?

  ఇక సంపత్ నంది చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అని తెలుస్తోంది. ఎందుకంటే ఇదివరకే సంపత్ నంది ఆ హీరో కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేశాడు. ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉండడం వలన సిటిమార్ కథను మొదట రామ్ తో చెప్పాడట. అయితే తన వయసు తగిన స్టోరీ అది కాదు అనే కారణంగా సినిమాను ఓకే చేయలేదట. కానీ కథ మాత్రం చాలా బావుందని కానీ ఈ కథ నాకు కొంచెం కూడా సెట్ అవ్వదు అని అనడం తోనే గోపీచంద్ వద్దకు వెళ్లారట.

  పవన్ కళ్యాణ్ తో సినిమా..

  పవన్ కళ్యాణ్ తో సినిమా..

  గౌతమ్ నంద కథ బాగానే ఉన్నప్పటికీ ఎందుకు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అంఫుకోలేదు అని , ఆ విషయం తనకు ఇప్పటికే బాధ కలిగిస్తుందని చెబుతూ సంపత్ తెలిపాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఆ ఓకేశారు సినిమా చేసే అవకాశం వచ్చిందని కూడా అన్నాడు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కథ అనుకున్నప్పుడు మొదట సంపత్ నంది చేస్తే బాగుంటుందని ఆలోచించారు.

  ఆ కథపై కొన్ని రోజుల పాటు బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేశాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టులోకి దర్శకుడు బాబీ వచ్చాడు. అయినప్పటికీ సంపత్ నంది ఏ మాత్రం నిరాశ చెందకుండా తప్పకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని, మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

  English summary
  Director sampath nandhi about seetimaarr movie gossips behind the reason
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X