Just In
- 45 min ago
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
- 1 hr ago
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
- 9 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 10 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
Don't Miss!
- News
యువతకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: లక్షన్నర మందికి పైగా బెనిఫిట్: మైక్రోసాఫ్ట్‌తో
- Sports
KKR vs MI: రోహిత్ శర్మకు తృటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే ఐపీఎల్ 2021 నుంచి ఔట్ అయ్యేవాడే!!
- Finance
మరో నెల రోజులు.. బంగారం హాల్ మార్కింగ్: కేంద్రం ఏం చెప్పిందంటే
- Lifestyle
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లవ్ స్టొరీ సినిమా వాయిదా.. మళ్ళీ రిలీజ్ అయ్యేది అప్పుడే: స్పందించిన శేఖర్ కమ్ముల
టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది.. నాలుగు బాక్సాఫీస్ హిట్స్ కూడా వచ్చాయి అని సంతోషించే లోపే మ్యాటర్ మళ్ళీ మొదటికొచ్చింది. గత ఏడాది మాదిరిగానే కొన్ని సినిమాలు మళ్ళీ వాయిదాల బాట పట్టాయి. ఏప్రిల్ 16న రావాల్సిన శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ కూడా వాయిదా పడటం అందరికి షాక్ ఇచ్చింది. ఇక మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిపై శేఖర్ కమ్ముల ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు.

లవ్ స్టొరీపై భారీ అంచనాలు
మంచి కాఫీ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా హిట్టుతో అగ్ర దర్శకుల జాబిలోకి వచ్చేశాడు. అయితే ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా లవ్ స్టొరీ. సాయి పల్లవి నాగ చైతన్య జంటగా నటించిన ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

100మిలియన్ల వ్యూవ్స్
ఇక ఇప్పటికే లవ్ స్టొరీ సినిమాకు సంబంధించిన పాటలు ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం లిరికల్ సాంగ్ తోనే 100మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.

క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల
ఇక సినిమాను వాయిదా వేస్తున్నారు అనగానే ప్రేక్షకులు అప్సెట్ అయ్యారు. ఇక చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి అసలు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి అంటూ సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చిందని అన్నారు. అయితే ఒక కారణం వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

రిలీజ్ ఎప్పుడంటే..
ఇక కరోనా సెకండ్ వేవ్ ఎక్కువవుతున్న తరుణంలో సినిమాను రిలీజ్ చేయడం ఎవరికి అంత క్షేమం కాదని అన్నారు. అందరూ హ్యాపీగా సినిమా చూడలాని అనుకుంటున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణంలోనే సినిమా చూస్తే బావుంటుందని శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు. ఇక కరోనా తీవ్రత తగ్గి పరిస్థితి మళ్ళీ అదుపులోకి వచ్చిన తరువాతే సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు.