»   » 'రోబో' లో మహా ఉంటే మూడు నాలుగు...శంకర్

'రోబో' లో మహా ఉంటే మూడు నాలుగు...శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రోబో' సినిమా మొత్తం మీద మహా ఉంటే మూడు నాలుగు మామూలు సన్నివేశాలుంటాయి. మిగతావన్నీ క్లిష్టమైన సన్నివేశాలే. వాటిని తీయడం ఎంత కష్టమో, చేయడం నటీనటులకి సైతం అంత కష్టమే అంటూ చెప్పుకొచ్చారు శంకర్. అక్టోబర్ 1న చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...ఇది చాలా క్లిష్టమైన సబ్జెక్టు....నటీనటులు, సాంకేతిక నిపుణులు బాగా సహకరించడం వల్లే నా ఊహా జగత్తులో ఈ సినిమా ఎలా ఉండాలని భావించానో అలా తీయగలిగా. ఇది మామూలు సినిమా కాదు. స్పెషల్ ఎఫెక్ట్స్‌కి తోడు 'రోబో'గా రజనీకాంత్ నటన సినిమాని అత్యున్నత స్థాయిలో నిలిపింది. ఆయనకి జోడీగా ఐశ్వర్య రాయ్ ప్రేక్షకుల్ని అలరిస్తారు అన్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ కృష్ణా ట్రేడర్స్ అధినేత తోట కన్నారావు విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ (యన్‌దిరన్), హిందీ భాషల్లో 2,250 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu